Guntur Karam Making Video: గుంటూరు కారం మూవీ థియేటర్స్ లో దిగేందుకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. యూనిట్ మాత్రం ప్రొమోషన్స్ జోరు తగ్గించడం లేదు. నేడు గుంటూరు కారం మేకింగ్ వీడియో విడుదల చేశారు. నిమిషానికి పైగా నిడివి కలిగిన గుంటూరు కారం మేకింగ్ వీడియో దుమ్మురేపింది అంటే అతిశయోక్తి కాదు. త్రివిక్రమ్ మార్క్ మేకింగ్ ప్రతి సన్నివేశంలో కనిపించింది. ఇక మహేష్ వీర వివాహం చేశాడు.
మాస్ సీన్స్, ఎలివేషన్స్ మేకింగ్ వీడియోకి హైలెట్ గా నిలిచాయి. గుంటూరు కారంలో స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. రమ్యకృష్ణ కథలో కీలకమైన తల్లి రోల్ చేస్తుంది. ప్రకాష్ రాజ్, సునీల్, జయరామ్, జగపతిబాబు వంటి ప్రముఖ నటులు గుంటూరు కారం మూవీలో భాగమయ్యారు. గుంటూరు కారం మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సంక్రాంతి సమరం రసవత్తరంగా మారింది. యంగ్ హీరో తేజ సజ్జా మహేష్ తో పోటీపడుతున్నాడు. హనుమాన్ చిత్రం సంక్రాంతి రేసు నుండి తప్పుకోవాలని నిర్మాతలకు ఎంత చెప్పినా వినలేదు. ఒత్తిడికి తలొగ్గకుండా మహేష్ తో ఢీ అంటున్నారు. హనుమాన్ మూవీ సైతం జనవరి 12న విడుదల కానుంది. అలాగే నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్ చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్నాయి.
సైంధవ్ జనవరి 13న, జనవరి 14న నా సామిరంగ విడుదలవుతున్నాయి. వీటన్నింటిలో గుంటూరు కారం భారీ బడ్జెట్ మూవీ. గుంటూరు కారం లో మహేష్ ఊరమాస్ రోల్ చేస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్-మహేష్ కాంబోలో మూవీ విడుదల అవుతుంది. దీంతో అంచనాలు ఏర్పడ్డాయి. గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయి.
