Pushpa 2: పుష్ప 2 విడుదల వాయిదా పడుతుందా… ఇదిగో క్లారిటీ!

దాదాపు రెండేళ్లుగా పుష్ప 2 చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పుష్ప 2 విడుదల వాయిదా పడే అవకాశం కలదని ఊహాగానాలు చెలరేగాయి.

Written By: NARESH, Updated On : January 11, 2024 2:42 pm

Pushpa 2

Follow us on

Pushpa 2: 2021లో విడుదలైన పుష్ప బ్లాక్ బస్టర్ కొట్టింది. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. అల్లు అర్జున్ ఇమేజ్ ఆకాశానికి చేరింది ఈ చిత్రం. ఏకంగా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. ఈ గౌరవం అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. పుష్ప చిత్రానికి కొనసాగింపుగా పుష్ప ది రూల్ పై హైప్ మామూలుగా లేదు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

దాదాపు రెండేళ్లుగా పుష్ప 2 చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పుష్ప 2 విడుదల వాయిదా పడే అవకాశం కలదని ఊహాగానాలు చెలరేగాయి. కారణం… ఈ మూవీలో కేశవ రోల్ కీలకం. పుష్ప 1 కేశవ పాత్ర వాయిస్ ఓవర్ తోనే సాగుతుంది. ఆ పాత్ర పుష్ప కథ చెబుతూ ఉంటుంది. హీరో పక్కనే ఉండే ఫుల్ లెంగ్త్ రోల్ కేశవ. ఈ పాత్రను జగదీశ్ అనే నటుడు చేస్తున్నాడు.

కాగా జగదీశ్ ఇటీవల అరెస్ట్ కాబడ్డాడు. ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని లైంగికంగా వాడుకోవడంతో పాటు ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో సదరు జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. విచారణలో జగదీశ్ కారణం అని తేలింది. అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు. జగదీశ్ జైలుపాలైన నేపథ్యంలో షూటింగ్ కి బ్రేక్ పడినట్లు కథనాలు వెలువడ్డాయి. షూటింగ్ కి ఆటంకం ఏర్పడగా పుష్ప 2 చెప్పిన తేదీకి విడుదల కావడం కష్టమే అనే చర్చ మొదలైంది.

దీనిపై చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చారు. పుష్ప 2 విడుదల అనుకున్న ప్రకారమే జరుగుతుందని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. నేడు దర్శకుడు సుకుమార్ బర్త్ డే కాగా … నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ బెస్ట్ విషెస్ తెలియజేశారు. అలాగే విషింగ్ నోట్ లో పుష్ప 2 విడుదల తేదీగా ఆగస్టు 15 మెన్షన్ చేశారు. దాంతో ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ భయపడాల్సిన పని లేదు. చెప్పిన ప్రకారం పుష్ప 2 విడుదల అవుతుంది.

https://twitter.com/MythriOfficial/status/1745294032404619454