Guntur Kaaram Vs Hanuman: సంక్రాంతి కానుకగా గుంటూరు కారం హనుమాన్ సినిమాలు ఈరోజు థియేటర్ లోకి రాబోతున్నాయి. ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబందించిన ప్రీమియర్ షో లు నిన్నటినుంచే వేశారు. ఈ రెండు సినిమాలకి సక్సెస్ టాక్ వచ్చినప్పటికీ గుంటూరు కారం సినిమా పెద్ద సినిమా అవ్వడం వల్ల దాని మీద ఎక్కువ మంది ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు హీరో అయినందువల్ల ఆ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి అలాగే సినిమా కూడా సక్సెస్ టాక్ ని తెచ్చుకుంది.
అయితే ఇప్పుడు చాలా మంది మాత్రం ఆ సినిమా ట్రైలర్ చూస్తే అది రొటీన్ రొట్ట ఫార్ములా సినిమా లాగానే ఉందని సోషల్ మీడియా లో కామెంట్లు చేస్తున్నారు దాంతో చాలా మందు ఈ సినిమాని చూసే కంటే హనుమాన్ లాంటి ఒక డిఫరెంట్ సినిమాని చూస్తే బాగుంటుందని యువత మొత్తం హనుమాన్ సినిమాకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హనుమాన్ సినిమాలో వాడిన వి ఎఫ్ ఎక్స్ గాని వాళ్ళ పర్ఫామెన్స్ లు గాని సూపర్ గా ఉన్నాయంటూ ఇప్పటికే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో హనుమాన్ సినిమా బుకింగ్ లు ఎక్కువగా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. గుంటూరు కారం సినిమా కూడా సూపర్ గా ఉందని చెప్తున్నప్పటికీ అనూహ్యం గా హనుమాన్ సినిమా ముందుకు దూసుకురావడం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం అనే చెప్పాలి.
అయితే హనుమాన్ సినిమాకి తక్కువ థియేటర్లు ఇచ్చి గుంటూరు కారం సినిమాకి ఎక్కువ థియేటర్లు కేటాయించడం వాళ్ల హనుమాన్ సినిమా మీద సింపతి బాగా పెరిగింది ఇక దాంతో పాటు గా ఈ సినిమాలో కంటెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉండడంతో అది రెండు విధాలుగా ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఇక దాంతో గుంటూరు కారం లాంటి ఒక రొటీన్ ఫార్ములా సినిమా చూసే కంటే విజువల్ వండర్ ని చూపించే సినిమాని చూస్తే బాగుంటుంది అంటూ జనాలు భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాకి జనాలు బ్రహ్మరథం పట్టనున్నట్టు గా తెలుస్తుంది.
ఇక రేపు థియేటర్లలో సందడి వాతావరణం నెలకొనపోతుంది… త్రివిక్రమ్, మహేష్ బాబు లాంటి సీనియర్ హీరో, డైరెక్టర్లు కలిసి ఒక యంగ్ హీరో యంగ్ డైరెక్టర్ చేతిలో పరాభవం పాలైనట్టుగా చాలామంది సోషల్ మీడియా వేదికగా వాళ్ల గురించి పోస్ట్ లు పెడుతున్నారు… కానీ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా మాత్రం ఇండస్ట్రీ లో టాప్ రేంజ్ లోకి ముందుకు వెళ్ళిపోబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి…