https://oktelugu.com/

Lal Salaam Twitter Review: లాల్ సలామ్ ట్విట్టర్ రివ్యూ: రజినీకాంత్ ఎంట్రీకి థియేటర్స్ బద్దలు, ఓవరాల్ టాక్ ఇదే!

నేడు లాల్ సలామ్ పలు భాషల్లో భారీగా విడుదల చేశారు. లాల్ సలామ్ చిత్ర ప్రీమియర్స్ ఇప్పటికే ముగిశాయి. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 9, 2024 / 12:02 PM IST
    Follow us on

    Lal Salaam Twitter Review: రజినీకాంత్ జైలర్ మూవీతో భారీ హిట్ కొట్టారు. బాక్సాఫీస్ షేక్ చేశారు. జైలర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజినీకాంత్ నుండి వస్తున్న మూవీ లాల్ సలామ్. అయితే ఈ చిత్రంలో ఆయన ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశారు. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. లాల్ సలామ్ మూవీ ప్రకటన నాటి నుండే అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. లాల్ సలామ్ చిత్రానికి రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించడం విశేషం. లాల్ సలామ్ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. అయితే కొన్ని కారణాల వలన ఫిబ్రవరి 9కి వాయిదా పడింది.

    నేడు లాల్ సలామ్ పలు భాషల్లో భారీగా విడుదల చేశారు. లాల్ సలామ్ చిత్ర ప్రీమియర్స్ ఇప్పటికే ముగిశాయి. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ లాల్ సలామ్ మూవీ పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. లాల్ సలామ్ మత సామరస్యం చాటి చెబుతూ తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా. విష్ణు విశాల్, విక్రాంత్ క్రికెటర్స్ రోల్స్ చేశారు. మత, రాజకీయ అంశాలను స్పృశించారు. చక్కని సందేశంతో రూపొందించారు.

    లాల్ సలామ్ మూవీలో మంచి కంటెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ అనుభవలేమి అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. మొత్తంగా లాల్ సలామ్ చూడదగ్గ మూవీ అని ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు. పలువురు ఆడియన్స్ లాల్ సలామ్ మూవీలోని రజినీకాంత్ ఎంట్రీ గురించి మాట్లాడుతున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో రజినీకాంత్ పాత్రను పరిచయం చేశారట. ముస్లిం మతానికి చెందిన మొయిద్దీన్ భాయ్ గా రజినీకాంత్ ఈ చిత్రంలో నటించారు.

    రజినీకాంత్ పాత్రను చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారు. యాక్షన్, ఎమోషన్ అంశాలు కూడా మెప్పించాయని అంటున్నారు. ఏఆర్ రెహమాన్ బీజీఎమ్ సైతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయని అంటున్నారు. అయితే లాల్ సలామ్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రమోట్ చేయలేదు. దాంతో ఓపెనింగ్స్ పూర్ గా ఉన్నాయి. రజినీకాంత్ నటించిన చిత్రానికి ఇంత తక్కువ హైప్ ఎప్పుడూ చూడాలని కొందరు తెలుగు ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.