Sankranti 2024 Movies
Guntur Kaaram Twitter Talk: సంక్రాంతి బరిలో సాలిడ్ గా దిగింది గుంటూరు కారం మూవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గుంటూరు కారం చిత్ర ట్రైలర్ సైతం ఆకట్టుకుంది. ఈ క్రమంలో గుంటూరు కారం చిత్ర టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్లైన్ బుకింగ్ బీభత్సంగా జరిగింది. ఇక జనవరి 11 అర్థరాత్రి నుండే ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. గుంటూరు కారం మూవీ చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.
గుంటూరు కారం ట్విట్టర్ టాక్ పరిశీలిస్తే.. మూవీ మదర్ సెంటిమెంట్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. మహేష్ బాబు తల్లిగా రమ్యకృష్ణ నటించారు. అయితే తల్లికి కొడుకు మహేష్ అంటే ఇష్టం ఉండదు. కొన్ని కారణాలతో మహేష్ తల్లికి దూరంగా పెరగాల్సి వస్తుంది. కన్న కొడుకు పట్ల తల్లి కఠినంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది. దీని వెనకున్న కారణం ఏమిటనేది అసలు ట్విస్ట్.
babu one man show once again. story, proper plot point lekunda just babu energy ni vaadukoni laagesadu guruji. thaman huge let down. not one bgm stood out. anyway loved the movie overall. fans ki next 3 years repeats eskodanki baguntadi. #GunturKaaram
— ryuk (@nirvahna_) January 11, 2024
ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంది. మహేష్ బాబు ఎనర్జీ, డాన్సులు, ఫైట్స్ హైలెట్ గా ఉన్నాయి. మహేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాస్ ఆడియన్స్ ని అలరించే కమర్షియల్ ఫార్మాట్ లో దర్శకుడు త్రివిక్రమ్ నడిపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్, మహేష్ చెప్పే పంచ్ డైలాగ్స్ కి ఈలలు పడతాయి. నెరేషన్ మాత్రం ఫ్లాట్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. అక్కడక్కగా బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి.
#GunturKaaram A Trivikram style story that is packaged with all commercial elements but none of it makes a solid impact. The movie is solely driven by Mahesh and he is at his best. Kurchi Madatha Petti song and a few entertaining blocks work well. The rest is subpar stuff and the…
— Venky Reviews (@venkyreviews) January 11, 2024
క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమా ఊపందుకుంది. గుంటూరు కారం మూవీలో త్రివిక్రమ్ మార్క్ డైరెక్షన్ అయితే కనిపించదు. హడావుడిగా తెరకెక్కించి వదిలారు అనే భావన కలుగుతుంది. మహేష్ బాబు డైలాగ్స్ వరకు ఓకే. మదర్ సెంటిమెంట్ పూర్తి స్థాయిలో పండలేదు. థమన్ బీజీఎమ్ సైతం నిరాశపరిచే అంశం. కుర్చీ మడతపెట్టి సాంగ్ కి మాత్రం థియేటర్స్ బద్దలు అవుతాయి.
#GunturKaaram – Strictly AVG. Worst Writing. Worst Music & BGM. @urstrulyMahesh One Man Show
This Is Another Agnyaathavaasi. I don’t know how MB Accepted This Script.
Sreeleela Cringe Acting . There is no scope for others at all.
ROD RODDER RODEST#GunturKaaramReview
— α (@Tranquility_Lyf) January 11, 2024
శ్రీలీల నటనకు యావరేజ్ మార్క్స్ వేస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్ వంటి స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ వారి పాత్రలు బలంగా లేవు. మొత్తంగా చెప్పాలంటే గుంటూరు కారం మహేష్ బాబు వన్ మ్యాన్ షో. మహేష్ తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో, కథలో దమ్ములేకపోయినా సినిమాను నిలబెట్టాడు. అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన గుంటూరు కారం ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ !
#GunturKaaram Trivikram opted for the perfect commercial format, and he succeeded very well. Mahesh’s energy and ease were never seen before; his dance moves and comedy timing elevated this movie to a whole new level. This is solely driven by Mahesh Babu, making it a perfect mass…
— Censor Reports (@CensorReports) January 11, 2024
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Guntur kaaram movie twitter talk in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com