Hanuman Twitter Talk
Hanuman Twitter Talk: విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆయన తెరకెక్కించిన అ, కల్కి, జాంబి రెడ్డి ప్రశంసలు అందుకున్నాయి. కమర్షియల్ సక్సెస్ పక్కన పెడితే ప్రశాంత్ వర్మలో టాలెంట్ ఉందన్న విషయం ప్రేక్షకుల్లో బలపడింది. హీరో తేజ సజ్జాతో జాంబి రెడ్డి తెరకెక్కించగా హిట్ టాక్ సొంతం చేసుకుంది. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో చిత్రం హనుమాన్. జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. హనుమాన్ మూవీ ప్రోమోలకు విపరీతమైన ఆదరణ లభించింది. దీంతో అంచనాలు ఏర్పడ్డాయి.
మరి అంచనాల మధ్య విడుదలైన హనుమాన్ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ట్విట్టర్ టాక్ ఏంటో చూద్దాం.. హనుమాన్ కథ విషయానికి వస్తే విలన్ వినయ్ రాయ్ బాల్యం నుండి సూపర్ హీరో కావాలని కలలు కంటాడు. అందుకు చేయని ప్రయత్నం ఉండదు. సాంకేతికతతో కాకుండా సహజంగా ఒక సూపర్ మాన్ గా మారాలని కోరుకుంటాడు. తన కల నెరవేర్చే ఒక అద్భుత హారం తేజా సజ్జా వద్ద ఉందన్న విషయం తెలుసుకున్న వినయ్ రాయ్ దాన్ని వెతుక్కుంటూ వస్తాడు…
Brace yourself for goosebumps and an extraordinary finale that will leave you spellbound. Highly recommended! #HanuMan#PrasanthVarma’s cinematic masterpiece in the making! The cast shines bright #TejaSajja ❤️
VFX enhances the experience without overshadowing the gripping… pic.twitter.com/H82y9g2Jid— Melbourne MAMA (@melbourne_mama) January 11, 2024
మరి వినయ్ రాయ్-తేజ సజ్జా మధ్య జరిగిన సంఘర్షణ ఎలాంటిది? ఈ కథలో గాడ్ హనుమాన్ ప్రస్తావన ఏంటి? అనేది కథ. హనుమాన్ చూసిన ప్రేక్షకులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇంత తక్కువ బడ్జెట్ లో అంత క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వడాన్ని కొనియాడుతున్నారు. హనుమాన్ మూవీలో కొన్ని సీన్స్ గూస్ బంప్స్ కలిగిస్తాయట.
Must watch #Hanuman
Hard work can be seen in every frame!!!!kudos @PrasanthVarma & @tejasajja123Super Hit pic.twitter.com/0fddmn25Wl
— karthik (@karthikreddy564) January 11, 2024
సూపర్ హీరో గా తేజా సజ్జా పాత్రకు న్యాయం చేశాడు. అతని ఇమేజ్ కి కథ, పాత్ర సెట్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. హీరో అక్క పాత్రలో వరలక్ష్మి, విలన్ వినయ్ రాయ్ మెప్పించారు. కథలో కామెడీ, ఎమోషన్స్, యాక్షన్, డివోషనల్ అంశాలు కలగలిపి చెప్పిన విధానం బాగుంది అంటున్నారు. మొత్తంగా హనుమాన్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అక్కడక్కడా విసిగించే ఎమోషనల్ సీన్స్ మినహాయిస్తే, భారీ అంచనాలు లేకుండా చూస్తే హనుమాన్ నచ్చుతుంది.
Prashant varma is Prashant varma
Different style of taking and mixing emotion,comedy and devotions together not an easy task he did very well #Hanuman #HanuManEverywhere #PrasanthVarma— Avinash (@avinashsagi) January 11, 2024
#Hanuman Prashant delivered a solid movie.Overall the movie is engaging. The divine scenes are portrayed with honesty that translates. never thought will see Hanumanji on screen with loudest cheers and vigils. Go watch with family Congratulations to the entire team @tejasajja123
— Sravan Kumar (@sravan_one) January 11, 2024
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Hanuman movie twitter talk in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com