Adi Reddy: ఒక యూట్యూబర్ రామ మందిర నిర్మాణానికి అంత విరాళం ఇచ్చాడా? ఆదిరెడ్డి సంపాదన ఎంత?

లక్షల మంది భక్తులు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ ఆది రెడ్డి కూడా తన వంతు విరాళం అందజేశాడు. కాగా యూట్యూబ్ ఛానల్ లో బిగ్ బాస్ రివ్యూలు చెప్పుకుంటూ ఫేమస్ అయ్యాడు ఆది రెడ్డి.

Written By: NARESH, Updated On : January 12, 2024 10:41 am

Adi Reddy

Follow us on

Adi Reddy: ఉత్తరప్రదేశ్ అయోధ్య లో జరుగుతున్న రామ మందిర నిర్మాణం పూర్తయింది. ఆలయం ప్రాణ ప్రతిష్ట కు సిద్దమవుతుంది. జనవరి 22న ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ రామ మందిర నిర్మాణాన్ని ప్రధాన మంత్రి మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాగా అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందుకోసం శ్రీరాముడి భక్తులు భారీగా విరాళాలు అందించారు.

లక్షల మంది భక్తులు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ ఆది రెడ్డి కూడా తన వంతు విరాళం అందజేశాడు. కాగా యూట్యూబ్ ఛానల్ లో బిగ్ బాస్ రివ్యూలు చెప్పుకుంటూ ఫేమస్ అయ్యాడు ఆది రెడ్డి. ఆ పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. అద్భుతమైన ఆట తీరు కనబరస్తూ .. నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లో అడుగుపెట్టి .. టాప్ 5లో నిలిచాడు.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూలు చెప్పుకుంటూ డబ్బు సంపాదిస్తున్నాడు. మొన్నటి వరకు సీజన్ 7 రివ్యూలు చెప్తూ లక్షల్లో ఆదాయం వచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు ‘ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ‘ ట్రస్ట్ కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు ఆయన విరాళం అందించాడు. రామ మందిరం నిర్మాణం అనేది మనందరి కల, హిందువుల కల కాబట్టి తనవంతుగా ఉడుత భక్తిగా ఈ విరాళం అందించానని ఆది రెడ్డి చెప్పారు. ఒక యూట్యూబర్ లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు.

అయితే ఇప్పటి వరకు రామ మందిరానికి విరాళాల రూపంలో సుమారు రూ. 3,200 కోట్లు వచ్చినట్లు సమాచారం. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలలో ఈ డబ్బు జమ అయింది. దీని పై వచ్చిన వడ్డీతో ఇప్పటి వరకు ఆలయ నిర్మాణం జరిగింది.