Star Heroine: అచ్చతెలుగు గోదావరి అమ్మాయి కోలీవుడ్ లో సత్తా చాటుతుంది. అక్కడ పదుల సంఖ్యలో చిత్రాలు చేస్తున్నారు. తమిళంలో సక్సెస్ అయ్యాక తెలుగు దర్శకులు, హీరోలు ఆమెను పట్టించుకున్నారు. రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్స్ ఆఫర్స్ ఇచ్చారు. ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఎవరో కాదు రాజోలు భామ అంజలి.
చెన్నైలో డిగ్రీ పూర్తి చేసిన అంజలి నటనపై మక్కువతో షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం మొదలుపెట్టారు. 2006లో విడుదలై ‘ఫోటో’ అనే చిత్రంలో వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగుతో పాటు తమిళ పరిశ్రమపై కూడా ఆమె ఫోకస్ పెట్టారు. అనూహ్యంగా ఆమె అక్కడ సక్సెస్ అయ్యారు.
Also Read: Gully Boy Riyaz Marriage: గల్లీ బాయ్స్ ఫేమ్ పొట్టి రియాజ్ పెళ్లి.. ఎవరిని చేసుకున్నాడో తెలుసా?
షాపింగ్ మాల్, జర్నీ వంటి చిత్రాలు తెలుగులో సక్సెస్ కావడంతో పాటు అంజలికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కెరీర్లో ఆమెకు దక్కిన అతిపెద్ద ఆఫర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. గోదావరి యాస, భాష తెలిసిన నటిగా సీత పాత్రకు అంజలిని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎంపిక చేశారు. వెంకటేష్ కి జంటగా సీత పాత్రలో అంజలి అద్భుతం చేశారు.
తర్వాత బలుపు మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. రవితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించి ఈ మూవీ మంచి విజయం అందుకుంది. మసాలా, గీతాంజలి ఇలా తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇక పవన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్ చిత్రంలో అంజలి కీలక రోల్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అంజలి బైరాగి అనే కన్నడ చిత్రం చేస్తున్నారు. అలాగే ‘నయట్టు’ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. కెరీర్ ఇలా ఉండగా సోషల్ మీడియాలో అల్లాడిస్తున్నారు. క్యూట్ క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.
తాజాగా అంజలి చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పట్టుచీర కట్టుకొని, నగలు అలంకరించుకున్న ముద్దులొలికే ఆ పాపగా అంజలి ఆకట్టుకుంది. తండ్రితో పాటు ఫోటోకి ఫోజిచ్చిన అంజలి క్యూట్ ఫోటోపై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ అంటూ అభిమానం చాటుకుంటున్నారు.
Also Read:Major Vs Vikram: మొదటి రోజు కలెక్షన్స్ లో ఎవరిది పై చెయ్యి..?