Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రేపు ( అక్టోబర్ 23 ) న పుట్టిన రోజు సంధర్భంగా ఆ రేంజ్ లో సంబరాలు చేసేందుకు ఆయన ఫ్యాన్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు ఆయన కోసం ప్రత్యేక పూజలు, అన్నదానం, రక్తదానం వంటి పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. మరోవైపు ఆయన నటిస్తున్న సినిమాల నుండి అభిమానుల కోసం సర్‌ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపధ్యం లోనే “రాధే శ్యామ్” టీమ్ రేపు టీజర్ రిలీజ్‌తో ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు అమ్ము డయ్యాయి. గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ “రాధే శ్యామ్” ఓవర్సీస్ రైట్స్ ను భారీ మొత్తానికి దక్కించుకున్నాయి. వారు యూఎస్ఏ, కెనడాలో “రాధే శ్యామ్”ను భారీ రేంజ్ లో విడుదల చేయనున్నారు. “రాధే శ్యామ్” యూఎస్ ప్రీమియర్‌లు 13 జనవరి 2022 న ప్రదర్శితం అవుతాయి. ఇక కర్ణాటక హక్కులను స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ కొనుగోలు చేసింది. కర్ణాటక వ్యాప్తంగా సినిమాను స్వాగత్ సంస్థ విడుదల చేస్తుంది. కాగా “రాధే శ్యామ్” 2022 జనవరి 14న పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. “రాధే శ్యామ్” టీజర్ రేపు ఉదయం 11:16 గంటలకు విడుదల కానుంది.
ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ తో పాటు… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్ ” లో కూడా నటిస్తున్నాడు. అలానే ఓం రావత్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. దీని తర్వాత నాగ్ అశ్విన్ ” ప్రాజెక్టు కె “, సందీప్ రెడ్డి వంగా ” స్పిరిట్ ” చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నాడు.