Ghani: వరుణ్​ ‘గని’ సినిమా కొత్త అప్​డేట్​.. ఆనందంలో ఫ్యాన్స్​

Ghani: మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గని’. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా సినిమా నుంచి కొత్త అప్​డేట్  వచ్చింది. అక్టోబరు 26న గని యాంతమ్​ పేరుతో  ఫస్ట్​ సింగిల్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తమన్​ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్​ పంచ్​ పేరుతో వచ్చిన గ్లింప్స్​ వీడియో ప్రేక్షకులను అమితంగా […]

Written By: Raghava Rao Gara, Updated On : October 22, 2021 2:45 pm
Follow us on

Ghani: మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గని’. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా సినిమా నుంచి కొత్త అప్​డేట్  వచ్చింది. అక్టోబరు 26న గని యాంతమ్​ పేరుతో  ఫస్ట్​ సింగిల్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తమన్​ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు.

ఇప్పటికే ఫస్ట్​ పంచ్​ పేరుతో వచ్చిన గ్లింప్స్​ వీడియో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కండలు తిరిగిన దేహంతో బాక్సింగ్​ రింగ్​లో ఉన్న వరుణ్​తేజ్​ పంచ్​ ఇస్తూ ఈ వీడియోలో కనిపిస్తారు. దీనికి తోడు తమన్​ నేపథ్య సంగీతం ఎంతగానో ఆకట్టుకుంది. మరోవైపు, దాదాపు షూటింగ్​ పూర్తి చేసుకున్న గని.. డిసెంబరు 3న విడుదల కానుంది.

ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. కంచె చిత్రంతో రెండో సినిమాకే తనలోని నటుడికి ప్రాణం పోసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వరుణ్​. ఆ తర్వాత వచ్చిన లోఫర్​, ఫిదా, గద్దలకొండ గణేశ్​ చిత్రాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపించాయి. వెంకీ మామతో కలిసి ఎఫ్​ 2 సినిమాలో స్క్రీన్​ షేర్ చేసుకున్నారు వరుణ్​. ఇప్పుడు బాక్సింగ్​ ఛాంపియన్​గా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నో అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా లేదా తెలియాలంటే.. విడుదలయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.