https://oktelugu.com/

Gemini TV Anchors: నాటి జెమినీ టీవీ యాంకర్స్ గుర్తున్నారా.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

Gemini TV Anchors: 80వ దశకంలో జెమినీ టీవీ ప్రారంభం అయిన విషయం అందరికి తెలుసు. టీవీతో పాటు శాటిలైట్ ప్రారంభం కూడా అదే సంవత్సరమే జరిగింది. అప్పట్లో వేరే ఛానల్స్ లేకపోవడంతో ఇందులో పనిచేసే యాంకర్స్ కు మంచి ఆధరణ ఉండేది. ఇప్పటికి ఛానల్ ప్రారంభించి 31 సంవత్సరం అయింది. అంటే మూడు దశాబ్దాలు అన్నమాట. అప్పుడు యాంకర్స్ గా కేరీర్ ప్రారంభించిన వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రస్తుతం యాంకర్స్ గా కొనసాగుతున్నారు. […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 26, 2022 / 01:42 PM IST
    Follow us on

    Gemini TV Anchors: 80వ దశకంలో జెమినీ టీవీ ప్రారంభం అయిన విషయం అందరికి తెలుసు. టీవీతో పాటు శాటిలైట్ ప్రారంభం కూడా అదే సంవత్సరమే జరిగింది. అప్పట్లో వేరే ఛానల్స్ లేకపోవడంతో ఇందులో పనిచేసే యాంకర్స్ కు మంచి ఆధరణ ఉండేది. ఇప్పటికి ఛానల్ ప్రారంభించి 31 సంవత్సరం అయింది. అంటే మూడు దశాబ్దాలు అన్నమాట. అప్పుడు యాంకర్స్ గా కేరీర్ ప్రారంభించిన వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రస్తుతం యాంకర్స్ గా కొనసాగుతున్నారు. కేవలం 5 నుండి 6గురు యాంకర్స్ మాత్రమే జెమినీలో సేవలందిస్తున్నారు.

    Anchor Rajini

    టీవీ 24 గంటలు ప్రజలకు దగ్గరగా ఉండడంతో అందులో పనిచేసే యాంకర్స్ ను బాగా గుర్తుపట్టేవారు అధికంగా ఉండేవారు. వారికి స్టార్ హీరోయిన్స్ కు వుండే గౌరవం ఉండేది. అప్పట్లో ఈటీవీ, జెమినీ టీవీ రెండు మాత్రమే ఉండడంతో అందులో పనిచేసే వారికి మంచి ప్రాదాన్యత ఉండేది. ఈటీవీ తో పోల్చుకుంటే జెమినీ టీవీ కొద్దిగా అధికంగా ప్రోగ్రామ్స్ చేయడం వల్ల అందులోని యాంకర్స్ కు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా ఉండేది.

    Also Read: Bigg Boss Telugu OTT: అరుచుకుంటూ ఆరోప‌ణ‌లు చేసుకున్న కంటెస్టెంట్లు.. నామినేష‌న్స్ లో ఉన్న‌ది వీళ్లే..

    వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా నిత్యం ప్రజలను ఏదో రకంగా యాంకర్స్ పలకరించే వాళ్లు. వాళ్ళెవరో ఒక లుక్కేద్దాం……..ఇందులో మొదటి వరుస లో ఉండేది జాహ్నవి. జెమినీ లో వచ్చే డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమానికి యాంకర్ గా ఉండేది. ఆమెను ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేదు. ఆ తర్వాత చాలా సిమిమాల్లో నటించిందామే తర్వాత పెళ్లి చేసుకుని ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆమె తర్వాత జెమినీ మ్యూజిక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మరో యాంకర్ జయంతి జెమినీ మ్యూజిక ఆదిత్య టీవీ అయినప్పుడు రాత్రి 10 గంటల వెన్నెల షో కు వచ్చేది జయంతి.

    Jahnavi Gemini TV Anchor

    ఆ తర్వాతి యాంకర్ అనుపమ అప్పట్లో సంచలనంగా మారిన అటకావాలా…పాట కావాలా అనే షో కు యాంకర్ గా పనిచేసింది ఆమె. ఆ ప్రోగ్రామ్ తో స్టార్ యాంకర్ ఇమేజ్ ను ఆమె సొంతం చేసుకున్నారు. జెమినీ సీరియల్స్, కొన్ని షోలకు యాంకర్ గా పనిచేసిన రజనీ అప్పట్లో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె ఎక్కడుంది అన్న విషయం ఎవ్వరికి తెలీదు. నీకోసం, బర్త్ డే విశేష్ చెప్పే అర్చన యాంకర్ కూడా అప్పట్లో ఫేమస్. ఆ షో ల తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. ఇలా అప్పట్లో వివిధ కార్యక్రమాల్లో జెమిని టీవీ లో యాంకర్స్ గా తలుక్కుమన్న వాళ్లు ప్రస్తుతం కనుమరుగయ్యారు. జెమినీ లో తప్పా వేరే టీవీల్లో వీళ్ళు కనిపించలేదు.

    Anchor Jayanthi

    వున్నవి రెండు టీవీలే కావడం వల్ల వీరి యాంకరింగ్ కు తిరుగులేకుండా పోయింది. కొత్త కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించేవాళ్ళు. పెళ్లి అయిన తరువాత దాదాపు అందులో 90 శాతం యాంకర్స్ ఇంటికే పరిమితం అయిపోయారు. దీంతో వారి కేరీర్ అక్కడికే ఆగిపోయింది. తర్వాత కాలంలో టీవీ ఛానల్స్ కూడా ఎక్కువకావడంతో యాంకర్స్ కనుమరుగు అవ్వడానికి మరొకారణం అయిందని బుల్లితెర అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

    Also Read:Suma: రాజీవ్ కనకాలతో గొడవలు నిజమే.. సుమ సంచలన వ్యాఖ్యలు వైరల్!

    Recommended Videos:

    Tags