https://oktelugu.com/

IIFA – 2023 : అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక… హృతిక్, అలియా భట్ లకు అత్యుత్తమ పురస్కారాలు!

2023 ఐఫా అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా హృతిక్ రోషన్ అవార్డు అందుకున్నారు. విక్రమ్ వేద చిత్రంలోని నటనకు గానూ ఈ అవార్డు దక్కింది.

Written By:
  • Shiva
  • , Updated On : May 28, 2023 / 11:48 AM IST
    Follow us on

    IIFA – 2023 : దుబాయ్ నగరం ఐఫా అవార్డ్స్ కి వేదికైంది. స్టార్స్ తో సందడిగా మారింది. మే 27 రాత్రి ఐఫా అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. నటులు విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇక నోరా ఫతేహి, రకుల్ ప్రీత్ సింగ్, కృతి సనన్, జాక్విలిన్ పెర్నాండెజ్ వేదికపై అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అలరించారు. 
     
    2023 ఐఫా అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా హృతిక్ రోషన్ అవార్డు అందుకున్నారు. విక్రమ్ వేద చిత్రంలోని నటనకు గానూ ఈ అవార్డు దక్కింది. ఇక అలియా భట్ ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకుంది. గంగూబాయి కతియావాడి చిత్రంలో నటనకు గానూ ఆమెను ఈ అవార్డు వరించింది. ఉత్తమ చిత్రంగా అజయ్ దేవ్ గణ్ నటించిన దృశ్యం 2 నిలిచింది. బ్రహ్మస్త్ర, గంగూబాయి కతియవాడి అత్యధిక అవార్డులు సొంతం చేసుకున్నాయి. 

    విభాగాల వారీగా ఐఫా 2023 అవార్డుల విజేతల వివరాలు ఇలా ఉన్నాయి… 

    బెస్ట్ యాక్టర్: హృతిక్‌ రోషన్‌ (విక్రమ్‌ వేద)
    బెస్ట్ యాక్ట్రెస్: అలియా భట్‌ (గంగూబాయి కతియావాడి)

    బెస్ట్ మూవీ: దృశ్యం 2

    బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: అనిల్‌ కపూర్‌ (జగ్‌జగ్‌ జీయో)
    బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ : మౌనీ రాయ్‌(బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)

    బెస్ట్ డైరెక్టర్: ఆర్‌.మాధవన్‌ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌)
    బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: ప్రీతమ్‌ (బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)

    బెస్ట్ స్క్రీన్ ప్లే  : గంగూబాయి కతియావాడి

    బెస్ట్ డైలాగ్స్: గంగూబాయి కతియావాడి

    బెస్ట్ సినిమాటోగ్రఫీ: గంగూబాయి కతియావాడి

    బెస్ట్ లిరిసిస్ట్: అమిత్‌ భట్టాచార్య (కేసరియా: బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)

    బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్‌ : బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1

    బెస్ట్ కొరియోగ్రఫీ: భూల్‌ భూలయా2

    బెస్ట్ సౌండ్‌ డిజైన్‌: భూల్‌ భూలయా 2

    బెస్ట్ ఎడిటింగ్‌: దృశ్యం2

    బెస్ట్ నేపథ్య సంగీతం: విక్రమ్‌ వేద

    బెస్ట్ సౌండ్‌ మిక్సింగ్‌: మోనికా ఓ మై డార్లింగ్‌

    బెస్ట్ డెబ్యూ హీరో: శంతను మహేశ్వరి (గంగూబాయి కాఠియావాడి), బబ్లీ ఖాన్‌(ఖులా)(ఇద్దరి మధ్య టై అయింది)

    బెస్ట్ డెబ్యూ హీరోయిన్: కుషాలీ కుమార్‌ (దోఖా: రౌండ్‌ డి కార్నర్‌)