IPL Final 2023 : ఐపీఎల్‌ ఫైనల్‌ 2023: శుభ్‌మన్‌గిల్‌ చెలరేగితే చెన్నైకి చుక్కలే! 

సొంత మైదానం ఆ జట్టకు ప్లస్‌పాయింట్‌ కాగా, సూపర్‌ ఫామ్‌లో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌. మరో ప్లస్‌పాయింట్‌. ముంబై, గుజరాత్‌ మధ్య జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో అతడికి ఇది మూడో సెంచరీ. గిల్‌ విధ్వంసంతో గుజరాత్‌ టైటాన్స్‌ రెండో క్వాలిఫయర్‌ లో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది.  

Written By: Raj Shekar, Updated On : May 28, 2023 12:02 pm
Follow us on

IPL Final 2023 : ఐపీఎల్‌ సీజన్‌– 16లో చివరి దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లో చెనై్న సూపర్‌ కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. సొంత మైదానం ఆ జట్టకు ప్లస్‌పాయింట్‌ కాగా, సూపర్‌ ఫామ్‌లో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌. మరో ప్లస్‌పాయింట్‌. ముంబై, గుజరాత్‌ మధ్య జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో అతడికి ఇది మూడో సెంచరీ. గిల్‌ విధ్వంసంతో గుజరాత్‌ టైటాన్స్‌ రెండో క్వాలిఫయర్‌ లో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది.

గిల్‌పై రోహిత్‌ ప్రశంసలు..
మ్యాచ్‌ అనంతరం ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ.. శుభ్‌మన్‌ గిల్‌ పై ప్రశంసలు కురిపించాడు. గిల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడని, ఇదే ఫామ్‌ను కూడా రాబోయే రోజుల్లో కొనసాగించాలని హిట్‌మ్యాన్‌ ఆకాంక్షించాడు. ‘అహ్మదాబాద్‌ గ్రౌండ్‌ పై ఇది గ్రేట్‌ టోటల్‌. శుభ్‌మన్‌ చాలా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. గిల్‌ మాదిరిగానే మా టీమ్‌లో కూడా ఎవరైనా ఒక్కరు ఆడి ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది. గిల్‌ తన ఫామ్‌ను కొనసాగించాలి.. అదే జరుగుతుందని ఆశిస్తున్నాం..’అని చెప్పుకొచ్చాడు.
మంచినీళ్లు తాగినట్లుగా పరుగులు..
ఈ ఏడాది టీ20, టెస్టు, వన్డేలలో సెంచరీలు చేసిన గిల్‌.. ఐపీఎల్‌ లో కూడా మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదుతున్నాడు. టీమిండియా పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఇది శుభపరిణామమే. వచ్చే నెల ఆస్ట్రేలియాతో జరుగబోయే ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో గిల్‌ రాణించడం భారత్‌ కు ఎంతో ముఖ్యం.
నాలుగు ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు..
2023 ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున శుభ్‌మన్‌ గిల్‌ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు చేశాడు. మొత్తం 851 పరుగులు చేశాడు. హోం గ్రౌండ్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుండడం కూడా గుజరాత్‌ జట్టుకు కలిసి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
డిఫెండింగ్‌ చాంపియన్‌.. నాలుగుసార్లు విజేత..
డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో ఐపీఎల్‌లో నాలుగుసార్లు విజేతగా, ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన చెనై్న సీజన్‌ 16 ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా శుభ్‌మన్‌ పరుగుల వరద పారిస్తాడని గుజరాత్‌ జట్టు యాజమాన్యం ధీమాతో ఉంది. గిల్‌ రెచ్చిపోతే చెన్నై జట్టుకు కష్టాలు తప్పవని అభిమానులు పేర్కొంటున్నారు.