Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో తొలిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన కథతో చేస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో వస్తున్న మొఘల్ చక్రవర్తుల కాలం నాటి కథతో ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రానికి ఆ కాలానికి సంబంధించిన సెట్స్ ను ఆర్ట్ డైరెక్టర్ తరణి నేతృత్వంలో నిర్మిస్తున్నారు.
కాగా ఇప్పటికే 60 శాతం మాత్రమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, తన తదుపరి షెడ్యూల్ షూటింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుందని చిత్రబృందం తెలిపింది. ఈ కొత్త షెడ్యూల్ లో నైట్ ఎఫెక్ట్ లో రెండు పాటల్ని పూర్తి చేయనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే పవన్ మళ్ళీ 20 రోజుల బ్రేక్ తీసుకోబోతున్నారు.
ఈ ఇరవై రోజులు పవన్, హరీష్ శంకర్ సినిమా పై కూర్చుంటాడట. ఇక క్రిష్ – పవన్ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ ఇది. పవన్ ది రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు. తన పార్ట్ కి సంబంధించి ఇప్పటికే పూర్తి అయిన సీన్స్ ను పవన్ ఆల్ రెడీ చూసాడట. పవన్ కి క్రిష్ డైరెక్షన్ చాలా బాగా నచ్చిందట.
నిజానికి క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ రెండో సినిమా చేయడానికి పవనే కారణం. పవర్ స్టార్ చెప్పడంతోనే క్రిష్ ఈ సినిమా చేశాడు, పైగా సబ్జెక్ట్ కూడా పవనే సూచించాడు, కొండపొలం అనే నవలను సినిమాగా తీయమని పవన్ చెబితేనే క్రిష్ చేశాడట. మొత్తానికి పవన్ కళ్యాణ్ కి క్రిష్ వర్కింగ్ స్టైల్ చాలా బాగా నచ్చింది.
మరి తన పై పవన్ కళ్యాణ్ పెట్టిన నమ్మకాన్ని క్రిష్ ఏ స్థాయిలో ఉపయోగించుకుంటాడో చూడాలి. ఎలాగూ క్రిష్ డైరెక్షన్ లో పవన్ సినిమా అంటే.. మల్టిప్లెక్స్ ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బిసి ఆడియన్స్ కి కూడా సినిమా కనెక్ట్ అయితే.. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం.