Telugu Actors Fail: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోలకు ఉన్న క్రేజ్ ఫెయిల్యూర్ హీరోల కైతే ఉండదు. అందువల్లే ఒక్క సక్సెస్ ని సాధించి టాప్ రేంజ్ లోకి ముందు దూసుకెళ్లాలని ప్రయత్నించే హీరోలు చాలామంది ఉన్నారు. కొంతమందికి మాత్రం ఎంత ప్రయత్నం చేసిన కూడా సక్సెస్ అయితే రావడం లేదు. కారణమేదైనా కూడా వాళ్ళ నుంచి వచ్చే సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే మాత్రం వరుసగా డిజాస్టర్లను మూట కట్టుకోవాల్సిన పరిస్థితితో ఏర్పడనుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు కావాలనే దర్శకులు రాసుకున్న కథల్లో వేలు పెట్టడం మేకింగ్ విషయంలో తమ ఇష్ట ప్రకారమే సినిమాని తీయాలని చెప్పడంతో ఆ సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆడడం లేదు.
Also Read: రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్ర*గ్స్ పార్టీ: సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ఇక ఈ క్రమంలోనే సందీప్ కిషన్ లాంటి హీరోలు చాలావరకు కథల విషయంలో జోక్యం చేసుకుంటారని అందువల్లే వాళ్లకు సక్సెసులైతే రావడం లేదని చాలామంది సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి వీళ్లతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంటే వీళ్ళు మాత్రం ఇంకా ఒక్క సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతున్నారు…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు ఈ హీరోలు చేసే ఒక సినిమాతో వస్తుందని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు దర్శకులతో సరైన ర్యాపో మైంటైన్ చేస్తూ దర్శకుల నిర్ణయాలకు వాల్యూ ఇస్తూ మంచి సినిమాలు చేయగలిగితే బాగుంటుంది. అంతే తప్ప వీళ్లకు నచ్చినట్టుగా సినిమాలు చేయాలని చెబితే ఏ దర్శకుడైన ఎందుకు ఒప్పుకుంటాడు.
కథ డిమాండ్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైన మేము సిద్ధంగా ఉన్నామని చెబుతున్న వీళ్ళు దర్శకుడిని సరైన క్రమంలో డైరెక్షన్ చేయనివ్వకుండా చేస్తే వాళ్లు మాత్రం ఏం చేస్తారు అంటూ సినిమా విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు… మొత్తానికైతే దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినప్పుడు మాత్రమే వీళ్లకు సక్సెసులైతే వస్తాయి…
