spot_img
Homeలైఫ్ స్టైల్Cooler Grass Pad Vs Honeycomb Pad: కూలర్లలో గ్రాస్ ప్యాడ్, హానీ కాంబ్ ప్యాడ్.....

Cooler Grass Pad Vs Honeycomb Pad: కూలర్లలో గ్రాస్ ప్యాడ్, హానీ కాంబ్ ప్యాడ్.. ఏది చల్లటి గాలిని ఇస్తుంది?

Cooler Grass Pad Vs Honeycomb Pad: వేసవికాలం రాగానే చల్లదనం కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఒకప్పుడు గ్లోబలైజేషన్ తక్కువగా ఉండడంతో వేడి తక్కువగా ఉండేది. దీంతో ఫ్యాన్లతో చల్లదనం సరిపోయేది. కానీ ఇప్పుడు పట్టణీకరణ, నగరికరణ పెరిగిపోవడంతో కూలర్లు, ఏసీలు తప్పనిసరిగా అవసరం ఏర్పడుతున్నాయి. అయితే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కూలర్ల కొనుగోలుకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ వీటి ధరలు కూడా ఇప్పుడు పెరిగిపోతున్నాయి. ధరల విషయం పక్కన పెడితే ఇందులో రకరకాల మోడల్స్ వచ్చాయి. వీటిలో ఏది బెటర్? అన్న సందేహం ఏర్పడుతోంది. అంటే కూలర్లు రెండు రకాలుగా తయారు చేయబడతాయి. వీటిలో చల్లదనాన్ని ఇచ్చే ప్యాడ్స్ ఒకటి హానీకోoబ్, మరొకటి గ్రాస్ ప్యాడ్ ఉంటాయి. అయితే వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుంది? అనేది చూద్దాం..

సాధారణంగా ప్రతి కూలర్ లలో చల్లని గాలి అందించేందుకు గ్రాస్ ప్యాడ్ ఉంటుంది. ఇది వాటర్ తో తడిచినప్పుడు చల్లటి గాలి అందిస్తుంది. అయితే ఈ గ్రాస్ ప్యాడ్ ప్రతి సంవత్సరం మార్చాల్సి ఉంటుంది. దీనిని ఎండు గడ్డితో తయారుచేస్తారు. ఈ గడ్డి మందం ఎక్కువగా పెరిగితే ఇందులో నుంచి గాలి లోపలికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ గడ్డిలో ఎక్కువగా బాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు నీటిని మార్చాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీని ధర తక్కువగా ఉంటుంది.

హానీ కాంబ్ ప్యాడ్ ప్రత్యేక ఆకృతిని కలిగి ఉంటాయి. ఇవి తేనె పట్టు ఆకారంలో ఉంటాయి. దీనిని ఒక్కసారి కొనుగోలు చేస్తే మూడేళ్ల వరకు వాడుకోవచ్చు. కానీ నీటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వేడి గాలిని తీసుకొని చల్లటి గాలిని లోపలికి అందిస్తుంది. ఈ ప్యాడ్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఫలితంగా వీటిపై ఎలాంటి దుమ్ము, బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా దీని ద్వారా వచ్చే గాలి విపరీతమైన చల్లదనాన్ని ఇస్తుంది. అయితే దీని ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది.

బడ్జెట్ కు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలంటే గ్రాస్ ప్యాడ్ కొనుగోలు చేయవచ్చు. కానీ మన్నిక కావాలంటే మాత్రం హనీ కాంబో ప్యాడ్ తీసుకోవడం బెటర్. హనీ కాంబో ప్యాడ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం కూలర్ కు రిపేరు చేయించాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రతి ఏడాది గ్రాస్ ప్యాడ్ కచ్చితంగా మార్చాలి. అంతేకాకుండా గ్రాస్ ప్యాడ్ కు నాచు చేరడంతో దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. హనీ కాంబో ప్యాడ్ కు ఆ అవకాశం లేదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Naga Chaitanya

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా...
Hardik Pandya

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే...
Team India

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...
AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Oktelugu Epaper