Pawan Kalyan vs Jagan : చంద్రబాబును పట్టించుకోకుండా పవన్ ఇమేజ్ ను జగన్ ఎందుకు పెంచుతున్నాడు?

Pawan Kalyan vs Jagan : 40 ఇయర్స్ చంద్రబాబును.. వదిలేసి కనీసం 10 ఏళ్ల రాజకీయ అనుభవం లేని పవన్ కళ్యాణ్ వెంట వైసీపీ బ్యాచ్ ఎందుకు పడుతోందన్నది ఎవ్వరికీ అంతుబట్టని ప్రశ్న. చంద్రబాబును కావాలనే విస్మరిస్తున్నారా? జనసేనాని పవన్ ఇమేజ్ ను కావాలనే వైసీపీ నేతలు పెంచుతున్నారనే అనుమానాలు లేకపోలేదు. పవన్ కు ఎందుకింత ఫ్రీ పబ్లిసిటీని వైసీపీ ఇస్తోందన్నది హాట్ టాపిక్ గా మారింది. పవన్ ను చంద్రబాబుకు ప్రత్యామ్మాయ నేతగా వైసీపీనే […]

Written By: NARESH, Updated On : November 7, 2022 5:06 pm
Follow us on

Pawan Kalyan vs Jagan : 40 ఇయర్స్ చంద్రబాబును.. వదిలేసి కనీసం 10 ఏళ్ల రాజకీయ అనుభవం లేని పవన్ కళ్యాణ్ వెంట వైసీపీ బ్యాచ్ ఎందుకు పడుతోందన్నది ఎవ్వరికీ అంతుబట్టని ప్రశ్న. చంద్రబాబును కావాలనే విస్మరిస్తున్నారా? జనసేనాని పవన్ ఇమేజ్ ను కావాలనే వైసీపీ నేతలు పెంచుతున్నారనే అనుమానాలు లేకపోలేదు. పవన్ కు ఎందుకింత ఫ్రీ పబ్లిసిటీని వైసీపీ ఇస్తోందన్నది హాట్ టాపిక్ గా మారింది. పవన్ ను చంద్రబాబుకు ప్రత్యామ్మాయ నేతగా వైసీపీనే తయారు చేస్తోందన్న వాదన ఉంది.

తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్ ను చావుదెబ్బ తీసిన కేసీఆర్ బీజేపీని పైకి లేపారు. ఇప్పుడు ఏకు మేకై కేసీఆర్ కుర్చీకే బీజేపీ ఎసరు తెచ్చిపెడుతోంది. ఇప్పుడు చంద్రబాబుపై కోపంతో పవన్ ను లేపుతున్న జగన్ కు ఆయన కుర్చీకే జనసేనాని వల్ల ఎఫెక్ట్ ఏర్పడే ప్రమాదం నెలకొంటోందట.. పక్కపార్టీని తొక్కేయాలన్న జగన్ స్కెచ్ బూమరాంగ్ అయిపోయి పవన్ ను స్ట్రాంగ్ నేతగా మార్చేస్తోంది.

గత ఎన్నికలతో పోలిస్తే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇప్పుడు ఏపీలో బాగా పెరిగింది. వైసీపీ అణిచివేతనే ఆయన్ను లీడర్ గా తయారు చేస్తోంది. ఏపీ సీఎం జగన్ వైఖరి వల్లే పవన్ ఇమేజ్ పెరుగుతోందని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. తాజాగా విశాఖపట్నం, ఇప్పటంలో పవన్ ను ఎంత తొక్కేస్తే అంతగా పైకి లేచారాయన.. ఎంతలా అంటే చంద్రబాబు సైతం పవన్ వద్దకు వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. పవన్ ను ఇప్పుడు చంద్రబాబును మించిన నేతను చేయడంలో వైసీపీ బ్యాచ్ కంకణం కట్టుకొని పనిచేస్తోంది.

చంద్రబాబు సీనియర్ పొలిటీషియన్. ఆయన్ను ఎంత రెచ్చగొట్టినా చివరకు పొత్తుల హస్తం చూపుతారు. అందుకే చంద్రబాబుపై తమ ప్లాన్లు వర్కవుట్ కావని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ ను బడా నేతగా తీర్చిదిద్ది.. ఆయనను ఇగో రెచ్చగొట్టేలా చేసి ఒంటరిగా పోటీచేసేలా చేస్తే తమ విజయం ఖాయమని వైసీపీ బ్యాచ్ వ్యూమాలు పన్నుతోంది. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ గెలవడం కష్టమే. అందుకే చంద్రబాబును వదిలేసి పవన్ వెంటపడుతోంది వైసీపీ బ్యాచ్. పవన్ ను రెచ్చగొట్టడమే స్ట్రాటజీగా మార్చుకుంది. పవన్ నే స్ట్రాంగ్ లీడర్ గా తీర్చిదిద్దితే పొత్తుల్లో సీట్ల సర్ధుబాటు కుదరక టీడీపీ, జనసేన విడిపోయి పోటీచేస్తారని.. అదే తమను గెలిపిస్తుందని వైసీపీ వ్యూహాలు పన్నుతోంది. ఆవేశాలకు పోయి పవన్ టీడీపీతో కలవకుంటే తమకే లాభం అనుకుంటోంది. అందుకే పవన్ వెంటపడి ఇంతలా వేధించి ప్రజల్లో ఆయన పాపులారిటీ పెంచుతోందని టాక్. మరి వైసీపీ ట్రాప్ లో పవన్ పడుతారా? లేదా ? వైసీపీ చాపకిందకే నీళ్లు తెచ్చి సీఎం అవుతారా? అన్నది వేచిచూడాలి.