Singer Mangli : సింగర్ మంగ్లీ పాటకు అంత తీసుకుంటుందా? ఆమె ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాకే!

Singer Mangli : ఓ సాధారణ అమ్మాయి మంగ్లీ స్టార్ సింగర్ గా ఎదిగిన తీరు అద్భుతం. ప్రత్యేకమైన స్వరం మంగ్లీ సొంతం. ఆర్డినరీ ట్యూన్ కూడా మంగ్లీ గొంతులో అద్భుతంగా పలుకుతుంది. ఆమె పాడితే పాటకు అందం వస్తుంది. అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారామె. జార్జి రెడ్డి సినిమాలో మంగ్లీ పాడిన ”వాడు నడిపే బండి రాయలు ఎన్ఫీల్డు”‘ బాగా పాపులర్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్స్ ఆమెను సంప్రదించడం స్టార్ట్ చేశారు. డివోషనల్ సాంగ్స్, ఐటెం […]

Written By: NARESH, Updated On : January 27, 2023 8:36 pm
Follow us on

Singer Mangli : ఓ సాధారణ అమ్మాయి మంగ్లీ స్టార్ సింగర్ గా ఎదిగిన తీరు అద్భుతం. ప్రత్యేకమైన స్వరం మంగ్లీ సొంతం. ఆర్డినరీ ట్యూన్ కూడా మంగ్లీ గొంతులో అద్భుతంగా పలుకుతుంది. ఆమె పాడితే పాటకు అందం వస్తుంది. అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారామె. జార్జి రెడ్డి సినిమాలో మంగ్లీ పాడిన ”వాడు నడిపే బండి రాయలు ఎన్ఫీల్డు”‘ బాగా పాపులర్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్స్ ఆమెను సంప్రదించడం స్టార్ట్ చేశారు. డివోషనల్ సాంగ్స్, ఐటెం నంబర్స్ కి మంగ్లీ కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. కేవలం ఐదారేళ్ళ కెరీర్లో పదుల సంఖ్యలో మంగ్లీ పాటలు పాడారు.

మరి ఫేమ్ వచ్చినప్పుడు డిమాండ్ చేయడం సాధారణం. మంగ్లీ మొదట్లో పాటకు రూ. 10 నుండి 20 వేలు తీసుకునేవారట. ఇప్పుడు ఆమె రెమ్యూనరేషన్ పాటకు లక్ష రూపాయల పైనే. ప్లే బ్యాక్ సింగర్ గా ఆమె సంపాదన పరిమితమే. అయితే ఈవెంట్స్ ద్వారా ఆమె లక్షల్లో ఆర్జిస్తున్నారు. మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా ఆమెకు ఫాలోయింగ్, ఫేమ్ ఉంది. ఒక్కో ఈవెంట్ కి మంగ్లీ లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారని సమాచారం. ఆమె రెమ్యూనరేషన్ రూ. 5 లక్షల పైనే అట.

మంగ్లీకి సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది. బోనాలు, శివరాత్రి, దీపావళి… ఇలా కొన్ని పెద్ద పండగలకు మంగ్లీ ప్రత్యేక భక్తి గీతాలు రూపొందిస్తారు. ఆ సాంగ్స్ ని తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తారు. సదరు వీడియోలకు మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ ఛానల్ తో ఆమె అదనంగా మరికొంత సంపాదిస్తున్నారు. స్వేఛ్చ టైటిల్ తో ఆమె హీరోయిన్ గా ఓ మూవీ తెరకెక్కింది. మ్యాస్ట్రో, గువ్వ గోరింక చిత్రంలో చిన్న పాత్ర చేశారు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మంగ్లీ ఆస్తుల విలువ పాతిక కోట్లకు పైనే. అనతి కాలంలో కేవలం తన టాలెంట్ తో మంగ్లీ లగ్జరీ లైఫ్ సొంతం చేసుకున్నారు. ఆమెకు హైదరాబాద్ లో ఖరీదైన ఇల్లు, సొంత కార్లు ఉన్నాయి. కాగా మంగ్లీ తన సంపాదనలో కొంత భాగం పుట్టి పెరిగిన ఊరికి ప్రజల కోసం ఆమె ఖర్చు చేస్తున్నారట. చాలా డబ్బులు వెచ్చించి ఒక ఆలయం అక్కడ నిర్మించారట. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో మంగ్లీ కారుపై దాడి జరిగిందంటూ వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేదు కన్నడ ప్రజలు మంచి హృదయం కలవారంటూ మంగ్లీ ఖండించారు.