ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సడెన్ గా ఢిల్లీకి బీజేపీ పెద్దలు పిలిపించడం వెనుక మతలబు ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. మంగళవారం రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అవుతున్నారు.
Also Read: కేసీఆర్, జగన్ ఢిల్లీ టూర్స్: ఏపీ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్జిస్ ల బదిలీలు?
పైకి చెబుతున్న దాని ప్రకారం.. భారీ వర్షాలు, నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రహదారులు, ఆస్తినష్టం గురించి వివరించి.. తక్షణమే సహాయం అందించాలని సీఎం జగన్ కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అయితే అంతకు మించిన సంగతి ఏదో ఉందని.. రాజకీయ అంశాలే అత్యధికంగా ఉండొచ్చని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న కేసీఆర్ డైరెక్టుగా మోడీ, అమిత్ షాలతో భేటి అయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ వెళ్లారు. దీంతో ఏంటి కథ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: ఓరుగల్లులో ‘బండి’ దూసుకెళ్లనుందా?
ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమం, వ్యవసాయ చట్టాలపై దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల మద్దతు.. దాన్ని అమలు కోసమే కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తున్నట్టు తెలిసింది. సాగు చట్టాలపై దేశంలో విస్తృతంగా చర్చ పెట్టాలని.. ఇందుకోసం 700 మీడియా సమావేశాలు, 700 సదస్సులకు బీజేపీ ప్లాన్ చేసినట్టు సమాచారం. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని వివరించాలని తీర్మానించారు.
ఈ క్రమంలోనే రైతు రాజ్యాలుగా ఉన్న ఏపీ, తెలంగాణ సీఎంలకు అపాయింట్ మెంట్లు ఇచ్చి మరీ వ్యవసాయ చట్టాలకు సహకరించాల్సిందిగా బీజేపీ పెద్దలు కోరినట్టు సమాచారం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్