https://oktelugu.com/

బిగ్ బాస్-4: మాస్టర్ వెన్నుపొటుకు ‘దివి’ బలి?

తెలుగు రియల్టీ షోలో బిగ్ బాస్ నెంబర్ వన్ కొనసాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్-4 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్-4 సీజన్ 50రోజులను పూర్తి చేసుకుంది. దసరా రోజు స్పెషల్ గా సాగిన బిగ్ బాస్-4 ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. అయితే తాజాగా జరిగిన ఎలిమినేషన్లో నటి దివీ బిగ్ హౌస్ నుంచి వెళ్లిపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. బిగ్ బాస్-4లో తొలి నుంచి దివీ తన గేమ్ ను చాలా సిన్సీయర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2020 / 10:37 AM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలో బిగ్ బాస్ నెంబర్ వన్ కొనసాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్-4 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్-4 సీజన్ 50రోజులను పూర్తి చేసుకుంది. దసరా రోజు స్పెషల్ గా సాగిన బిగ్ బాస్-4 ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. అయితే తాజాగా జరిగిన ఎలిమినేషన్లో నటి దివీ బిగ్ హౌస్ నుంచి వెళ్లిపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.

    బిగ్ బాస్-4లో తొలి నుంచి దివీ తన గేమ్ ను చాలా సిన్సీయర్ గా ఆడుతూ వస్తోంది. పలు టాస్కులు విన్నర్ గా నిలిచింది. అంతేకాకుండా కెప్టెన్ గాను మంచి ఫార్మమెన్స్ చూపించింది. బిగ్ బాస్ లోని కంటెస్టులతో ఓవర్ ఇంటరాక్ట్ కాకుండా తన గేమ్ పైనే ఫోకస్ పెట్టే దివీ వెళ్లిపోవడం వెనుక వెన్నుపోటే కారణమని తెలుస్తోంది.

    బిగ్ బాస్-4లో అడుగుపెట్టినప్పటి నుంచి దివీ ఎవరికీ పెద్దగా నమ్మలేదు. తన గేమ్ ను తాను నిజాయితీగా ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తమ పక్కనే ఉండే అమ్మ రాజశేఖర్ ను మాత్రం ఈ బూటీ స్టడీ చేయలేకపోయింది. ప్రతీ విషయంలోనూ దివీ డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ పై డిపెండ్ అయింది. దీనిని అతడు అలుసుగా తీసుకొని ‘గర్ల్ ఫ్రెండ్’.. ‘ఫిగర్’ అంటూ ఆమె వెనుక మాట్లాడేవాడు.

    దీంతో దివీని చూపిస్తున్న ప్రతీసారి అమ్మ రాజశేఖర్ ను చూపించడం.. కపుల్ డాన్సులున్నప్పుడు వీరిద్దరిని కలిపి పంపించడం వంటివి బిగ్ బాస్ చేశాడు. అయితే ఇదంతా ఆమె ఎలిమినేషన్ అయ్యే వరకు బయటికి ఎలా కన్పిస్తుందనేది దివీకి అర్థంకాలేదు. అందుకే ఆమె బయటికి వెళుతూ కూడా హౌస్ లో తనకు నిజంగా అమ్మలాంటివారు రాజశేఖర్ అంటూ కామెంట్ చేసింది.

    చివర్లో దివీ జర్నీకి సంబంధించిన వీడియో ప్లే చేశాకే దివీకి అసలు మ్యాటర్ అర్థమైనట్లు కన్పించింది. తనకు వంట వచ్చిన మగాళ్లు ఇష్టమని చెప్పగా.. రాజశేఖర్ ఒకలాంటి ఎక్స్ ప్రేషన్ ఇచ్చాడు. ఇది చూసిన దివీ అవాక్కయింది. అయితే రాజశేఖర్ ప్రతీసారి కంటెస్టులతో ఎమినేషన్ బ్లాక్ మొయిల్ చేస్తూ బిగ్ బాస్ లో కొనసాగుతోన్నాడు. దీంతో ఈవారంలో మాస్టర్ వెన్నుపోటుకు మరెవరూ బలి అవుతారననే చర్చ ఆడియన్స్ మధ్య జరుగుతోంది.