Veerasimha Reddy Story Leak : వీరసింహారెడ్డి స్టోరీ లీక్.. బాలయ్య డ్యూయల్ రోల్స్, బాలసింహారెడ్డి ఎంట్రీతో!

Veerasimha Reddy Story Leak : 2023 సంక్రాంతి చిత్రాలపై భారీ హైప్ నెలకొని ఉంది. చిరంజీవి,బాలకృష్ణ, విజయ్, అజిత్ పెద్ద పండుగకు తమ కొత్త చిత్రాలు విడుదల చేస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలు వారసుడు, తునివు పక్కన పెడితే ప్రధాన పోటీ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల మధ్య నెలకొననుంది. జనవరి 12న వీరసింహారెడ్డి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక 13న వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కాయి. […]

Written By: NARESH, Updated On : December 18, 2022 9:25 am
Follow us on

Veerasimha Reddy Story Leak : 2023 సంక్రాంతి చిత్రాలపై భారీ హైప్ నెలకొని ఉంది. చిరంజీవి,బాలకృష్ణ, విజయ్, అజిత్ పెద్ద పండుగకు తమ కొత్త చిత్రాలు విడుదల చేస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలు వారసుడు, తునివు పక్కన పెడితే ప్రధాన పోటీ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల మధ్య నెలకొననుంది. జనవరి 12న వీరసింహారెడ్డి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక 13న వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కాయి. ఈ క్రమంలో సంక్రాంతి విన్నర్ ఎవరవుతారనే ఆసక్తి నెలకొంది. స్టార్ హీరోల సంక్రాంతి పోరును ఫ్యాన్స్ ప్రత్యేకంగా చూస్తారు.

ఈ క్రమంలో వీరసింహారెడ్డి చిత్ర కథ ఇదే అంటూ ఒక వాదన తెరపైకి వచ్చింది. కాగా వీరసింహారెడ్డి మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. వీరసింహారెడ్డి, బాలసింహారెడ్డి అనే తండ్రి కొడుకులుగా ఆయన పాత్రలు ఉంటాయట. పేదలకు అండగా, అందరి తల్లో నాలికలా ఉండే వీరసింహారెడ్డి అంటే ప్రజలకు ప్రేమాభిమానాలు. ప్రజలకు మంచి చేస్తున్న వీరసింహారెడ్డి అంటే ఒక వర్గానికి గిట్టదు. న్యాయం, ధర్మం అంటూ తమ ప్రయోజనాలు దెబ్బతీస్తున్న వీరసింహారెడ్డిని శత్రువులు చంపేస్తారు.

అప్పుడు వీరసింహారెడ్డి కొడుకు బాలసింహారెడ్డి యూఎస్ నుండి దిగుతాడట. సున్నితంగా పెరిగిన, ఎడ్యుకేటెడ్ బాలసింహారెడ్డిని శత్రువులు తక్కువ అంచనా వేస్తారట. అయితే ఫ్యాక్షనిజంలో బాలసింహారెడ్డి పీక్స్ చూపించి తండ్రిని చంపినవారికి చుక్కలు చూపిస్తాడట. అలాగే ఆయన ఆశయాలు, అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తాడట. మొత్తంగా వీరసింహారెడ్డి కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఇది రొటీన్ కథే అయినప్పటికీ బాలయ్య మార్క్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ పడితే బాక్సాఫీస్ బద్దలవుతుంది. అలాగే డ్యూయల్ రోల్స్ బాలయ్యకు బాగానే కలిసొచ్చాయి. సింహ, లెజెండ్, అఖండ చిత్రాల్లో బాలయ్య డ్యూయల్ రోల్స్ చేశారు. అవి పెద్ద విజయం సాధించాయి. ఇక సంక్రాంతి బాలయ్యకు బాగా కలిసొచ్చిన సీజన్. సంక్రాంతి హీరోగా ఆయన ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. కాగా వీరసింహారెడ్డి చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా… థమన్ సంగీతం అందిస్తున్నారు.