Twitter employees: ట్విట్టర్ ను ఎలన్ మస్క్ సొంతం చేసుకోవడంతో ఉద్యోగుల్లో భయం పట్టుకుంది. మస్క్ మనస్తత్వం ఎరిగిన వారుగా తమ భవితవ్యం ఏంటని ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఈవో, లీగల్ హెడ్ లను తొలగించేందుకు మస్క్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కూడా వారి చెవిన పడటంతో వారు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సజావుగా సాగుతున్న ప్రయాణంలో అలజడులు సృష్టించే మస్క్ గురించి అందరికి బాగా తెలుసు. అందుకే ఎవరి దారి వారు చూసుకోవాలని నిశ్చయించుకున్నట్ల సమాచారం.
కంపెనీలో ఎక్కువ వేతనాలు పొందుతన్న వారిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వారి పోస్టులు ఊస్టు కావడంపై ఇప్పటికే సూచనలు చేసినట్లు చెబుుతున్నారు. దీంతో మిగతా ఉద్యోగులు సైతం తమ జాబ్ లు ఉంటాయో ఊడతాయో తెలియని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. సంస్థ సాఫీగా సాగాలంటే ఉద్యోగులను మార్చడం కాదు వారి నైపుణ్యం మార్చుకోవడమే. కానీ ఇంత చిన్న లాజిక్ మస్క్ ఎలా మరిచిపోయార తెలియడం లేదు.
Also Read: Mahesh Babu- Director Sukumar: అప్పుడు చెడింది, ఇప్పుడైనా కుదురుతుందా ?
ట్విట్టర్ కొనుగోల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ ఏడాది డిసెంబర్ రావచ్చు. అప్పటి వరకు ఉద్యోగులు ఉండొచ్చు. ఆయన చేతికి అధిారం వస్తేనే తొలగింపు చేసే అవకాశం ఉండటంతో అప్పటి వరకు ఉండొచ్చనే ధీమాలో ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. తమ ఉద్యోగాలు పోతే తాము ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. భవిష్యత్ లో ట్విట్టర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉందని సీఈవో పరాగ్ అగర్వాల్ పేర్కొంటున్నారు.
ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇప్పట్లో ఉండదని భవిష్యత్ లో చేపట్టొచ్చని తెలుస్తోంది. మేనేజ్ మెంట్ సరిగా లేదని అందుకే మార్పులు అనివార్యమని మస్క్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీని కోసమే ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఉద్యోగుల తొలగింపుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మస్క్ చేస్తున్న వ్యవహారాలతో అందరు కంగారు పడుతున్నారు. తమ ఉనికి ఏంటని ప్రశ్నించుకుంటున్నారు. ఉంటామా ఊడతామా అనే బెంగ ఉద్యోగుల్లో పట్టుకుంది.
Also Read: Amaravati Issue: అమరావతి విషయంలో వైసీపీ, టీడీపీ మాటల యుద్ధం?