Early Elections Telangana: తెలంగాణలో రాజకీయాలు వేసడి ఎండలను మించి సెగలు పుట్టిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్ లక్ష్యంగా జాతీయ పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. గులాబీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు ఢిల్లీ నేతలు క్యూ కడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కారు స్పీడ్‌కు బ్రేక్‌లు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో తప్పనిసరిగా గులాబీ నేతలు కూడా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి.. జాతీయ పార్టీలను ప్రశ్నించడం, విమర్శిండం, ఆరోపణలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పొలిటికల్ హీట్ తెలంగాణ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

సాధారణంగా ఎన్నికల సమయంలో నేతల రాక, పార్టీల హడావిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎన్నికలు లేకున్నా.. అలాంటి సందడే కనిపిస్తోంది. జాతీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. జాతీయ నేతల వరుస పర్యటనలు కాకా రేపుతున్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం రాష్ట్రంలో పర్యటించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. వరంగల్‌లో జరిగే రైతు సంఘర్షణ సభకు హాజరవుతారు. జాతీయ నేతల పర్యటనలతో రాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ఒకరిపై మరొక పార్టీకి చెందిన నేతలు తీవ్ర విమర్శిస్తున్నారు. మీరెందుకు వస్తున్నారంటే.. మీరెందుకు వస్తున్నారని దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు ముఖ్యనేతలు తెలంగాణకు రాబోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు.
Also Read: Twitter employees: ట్విట్టర్ ఉద్యోగుల్లో ఆందోళన.. మస్క్ నిర్ణయంతో భయం?
14న అమిత్‌షా..
తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం రెండో విడత యాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్ర సందర్భంగానే ఆ పార్టీ జాతీయ నేతలు తెలంగాణకు వస్తున్నారు. నిన్న మహబూబ్‌నగర్ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. ఇక రెండో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా మే 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ సమీపంలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ సభకు హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాహుల్‌గాంధీ సభ కంటే భారీగా నిర్వహించాలని నిర్ణయించింది. 55 నియోజకవర్గాల నుంచి 10 వేల మంది చొప్పున 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లలో నిమగ్నమైంది. రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తును నిర్ణయించేది అమిత్ షా సభే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఈ సభ ద్వారా సంకేతాన్ని ఇవ్వాలని భావిస్తున్నారు.
మోదీ పర్యటన..
ప్రధాని నరేంద్ర మోదీకూడా తెలంగాణలో ఇదే నెలలో పర్యటించే అవకాశముంది. త్వరలో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. అందుకోసం ఈనెల 25 లేదా 26న తెలంగాణకు రానున్నారు. మే 26న వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 2018 ఆగస్టు 7న ఎరువుల కర్మాగార నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. గత ఏడాది సెప్టెంబరు 9న మోదీ చేతుల మీదుగా ఈ కర్మాగారాన్ని జాతికి అంకింతం చేయాలని భావించినప్పటికీ .. చివరి క్షణంలో వాయిదా పడింది. ఐతే ఈనెలలో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కేంద్రం నుంచి మార్గదర్శకాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం అప్రమత్తమై అందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది.

ముందస్తు వ్యూహమే…
సాధారణంగా ఎన్నికల సమయంలో నేతల రాక, పార్టీల హడావిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎన్నికలు లేకున్నా.. అలాంటి సందడే కనిపిస్తోంది. జాతీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీలు కాస్త బలహీనంగా కనిపిస్తున్నాయని.. వాటికి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా.. ముందుస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని.. ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో మాదిరే ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని సమాచారం ఉండడంతోనే.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనే లక్షోయంతో జాతీయ నేతలంతా తెలంగాణ పర్యటనకు వస్తున్నట్లు ్రçపచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కూడా ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవాన్ని ఈ నెలలోనే పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:Single Dose Corona Vaccine: సింగిల్ డోస్ కరోనా టీకాలతో ఇబ్బందులేనా?