Tollywood vs Bollywood : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయి లో వినిపిస్తుంది. ఇండియన్ సినిమా అంటే ఒక తెలుగు సినిమానే అని ప్రపంచ దేశాలు అనుకునేలా మన సినిమాలను తీర్చిదిద్దడం మన దర్శకులకే చెల్లింది. ఇక ఇలాంటి క్రమంలో మన దర్శకులు చేస్తున్న ప్రతి సినిమా సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా మన ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్లు ఇప్పటికే వరుస సినిమాలు చేస్తు తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఇక ఇప్పుడు సౌత్ సినిమా డైరెక్టర్లు మన తెలుగు సినిమాలనే ఫాలో అవుతున్నారు.
నార్త్ లో ఉన్న దర్శకులు మన తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఫిక్స్ అవుతున్నారు. బాలీవుడ్ హీరోలు మన డైరెక్టర్లతో సినిమాలు చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… గత కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ టాలీవుడ్ మధ్య నడుస్తున్న పోటీలో ఇప్పుడు టాలీవుడ్ విజయం సాధించిందనే చెప్పాలి.ఇక ఇలాంటి సక్సెస్ అనేది టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక మీదట రాదేమో అనేంతలా మన దర్శకులు రెచ్చిపోయి సినిమాలు చేస్తున్నారు.
ఎందుకంటే ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు మన హీరోలని ఎంతలా అణిచివేతకు గురి చేశారంటే, మన సినిమా ఒకటి పాన్ ఇండియాలో రిలీజ్ అయితే ఆ సినిమా నడవకుండా మొదటి నుంచి దానికి నెగటివ్ రివ్యూలు ఇస్తూ మన హీరోలు అక్కడ రాణించకూడదనే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. అందువల్లే నాగార్జున, చిరంజీవి లాంటి మన హీరోలు హిందీలో సినిమాలు చేయాలని అనుకున్నప్పటికీ వాళ్ళ డామినేషన్ ని తట్టుకోలేక తెలుగుకే పరిమితమయ్యారు.
ఇప్పుడు మన హీరోల స్థాయి మన డైరెక్టర్ల టాలెంట్ ఏంటో వాళ్ళందరికీ తెలిసి వచ్చింది. కాబట్టి వాళ్లు ఆపిన ఆగే పరిస్థితిలో ఇప్పుడు తెలుగు సినిమా లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేక గమ్మునే చూసుకుంటూ కూర్చుంటున్నారు…ఇన్ని సంవత్సరాలకి మనవాళ్ళు బాలీవుడ్ వాళ్ల పోగరును అణిచి వేశారనే చెప్పాలి…