Homeఎంటర్టైన్మెంట్Anchor Sreemukhi : ఇతడే నా లవర్... ఎట్టకేలకు ఓపెన్ అయిన శ్రీముఖి, ఎవరో తెలుసా?

Anchor Sreemukhi : ఇతడే నా లవర్… ఎట్టకేలకు ఓపెన్ అయిన శ్రీముఖి, ఎవరో తెలుసా?

Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక పక్క యాంకరింగ్ .. మరో వైపు సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. బుల్లితెర పై గ్లామరస్ యాంకర్ గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. చలాకి మాటలతో .. సూపర్ ఎనర్జీ లెవల్స్ తో.. షో ఏదైనా సరే అల్లాడించేస్తుంది శ్రీముఖి. సోషల్ మీడియాలో తరుచూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్స్ తో ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అయితే శ్రీముఖి పెళ్లి గురించి ఎప్పట్నుంచో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె ఒక వ్యక్తితో ప్రేమలో ఉందని. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోనుందని అప్పట్లో ఓ న్యూస్ వైరల్ అయింది. అంతే కాకుండా యాంకర్ ప్రదీప్, శ్రీముఖి లవ్ లో ఉన్నారని కూడా రూమర్స్ వచ్చాయి. వాటిని ఖండిస్తూ శ్రీముఖి, ప్రదీప్ .. మేమిద్దరం మంచి స్నేహితులం. మా మధ్య ప్రేమ లాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా శ్రీముఖి ఒక ఫేమస్ సింగర్ తో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది.

తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ని ప్రేమిస్తున్నట్లు చెప్పి, సీక్రెట్ బయట పెట్టింది. స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ షో లో ఆ విషయాన్ని అందరి ముందు చెప్పి షాక్ ఇచ్చింది. సూపర్ సింగర్ లేటెస్ట్ ఎపిసోడ్ వింటేజ్ థీమ్ లో ప్లాన్ చేశారు. దీంతో జడ్జెస్ రెట్రో గెటప్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో జడ్జ్ అనంత్ శ్రీరామ్ తో కలిసి శ్రీముఖి డాన్స్ చేసింది. అనంత్ శ్రీరామ్ ని ఉద్దేశిస్తూ… నువ్వు తుంటరోడివి అని నాకు ముందే తెలుసు .. అందుకే ఇతన్ని ప్రేమిస్తున్నాను అంటూ .. రాహుల్ వైపు చూపించింది.

దీంతో రాహుల్ చిన్న స్మైల్ ఇచ్చాడు. అయితే ఇదంతా నిజం కాదు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. షోలో ఫన్ కోసం శ్రీముఖి చేసిన కామెడీ ఇది. కాగా ఇటీవల శ్రీముఖి భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆది వారం విత్ స్టార్ మా పరివారం, సూపర్ సింగర్ షో లతో పాటు పలు ఈవెంట్స్ చేస్తూ బిజీ గా ఉంటుంది శ్రీముఖి.

https://www.youtube.com/watch?v=TjgrEbVX_cM

Most Popular

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper
Exit mobile version