Prabhas-Jr NTR: దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ వన్ దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ఈయన స్టార్ డం ముందు స్టార్ హీరోలు కూడా పనిచేయరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. రాజమౌళి ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఏ స్టార్ హీరో సినిమాకి లేనంత క్రేజ్ ఆ సినిమాకి దక్కుతుంది అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
నిజానికి స్టార్ హీరోలు స్క్రీన్ మీద కనిపిస్తారు, కానీ నార్మల్ హీరోలను స్టార్ హీరోలను చేసేది మాత్రం డైరెక్టర్ అనే చెప్పాలి. ఇక అలాంటి దర్శకుల్లో ది బెస్ట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఒకే ఒక్కడు రాజమౌళి…ఈయన తలచుకుంటే కొత్త హీరోని కూడా స్టార్ హీరో గా మారుస్తాడు…ఇక రాజమౌళి ప్రభాస్ తో ఛత్రపతి, బాహుబలి సినిమాలు చేశాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, త్రిబుల్ ఆర్ లాంటి నాలుగు సినిమాలు చేశాడు. అయితే ఛత్రపతి సినిమా తర్వాత ప్రభాస్ ని ఎన్టీఆర్ ను పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలని అనుకున్నాడు కానీ అపుడున్న పరిస్థితులను బట్టి ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు.
దానివల్లే ఆ తరువాత త్రిబుల్ ఆర్ అనే సినిమా చేసి సక్సెస్ ని సాధించాడు. నిజానికి ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా చాలా టాలెంటెడ్ హీరోలు. ఇద్దరిని పెట్టి 2006 లో కనక ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా పడుంటే తెలుగు సినిమా రేంజ్ అప్పుడే మారిపోయి ఉండేది. కానీ ఈ మల్టీ స్టారర్ సినిమాల్లో అప్పుడున్న ప్రేక్షకుల ధోరణి ని బట్టి చూస్తే ఒక హీరో ను తక్కువగా, ఒక హీరోని ఎక్కువగా చూపించారనే గొడవలు ఎదురవుతాయనే ఒకే ఒక కారణంతో రాజమౌళి ఆ సినిమాని ఆపేసినట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే తను అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ ని, రామ్ చరణ్ ని పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ తెరకెక్కించాడు. ప్రభాస్ మిస్ అయినప్పటికీ రామ్ చరణ్, ఎన్టీఆర్ ని పెట్టి సినిమా చేయడం అనేది మంచి విషయం అనే చెప్పాలి. ఇక ఇప్పుడు సినిమా ఇండ్రస్టీ లో మల్టీ స్టారర్ స్టోరీలకి ఆదరణ ఎక్కువగా పెరుగుతుంది…