The Raja Saab Disaster: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. మొదటి నుండి ఈ చిత్రం పై అభిమానుల్లో ఉన్న భయమే నిజం అయ్యేలా చేసాడు డైరెక్టర్ మారుతీ. చిన్న సినిమాలు తీసుకునే డైరెక్టర్ కి, ఒక్కసారిగా ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేసే అవకావం వస్తే, ఎలా హ్యాండిల్ చేయగలడు, అసాధ్యం అని అందరూ అనుకున్నారు. కానీ విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతీ మాట్లాడిన మాటలు, ఆ తర్వాత రెండు రోజులకు విడుదలైన ఈ సినిమా రిలీజ్ ట్రైలర్, రెండు కూడా ప్రేక్షకుల్లో కొత్త అంచనాలు రేకెత్తించేలా చేసింది. పర్వాలేదు, మారుతీ ఎదో చిన్న సినిమా తీస్తాడని అనుకుంటే, పెద్ద సినిమానే తీసాడు, ఈ మాత్రం చాలు, సంక్రాంతికి ఇరగ కుమ్మేస్తాడని అభిమానులు రిలాక్స్ అయ్యారు.
కానీ విడుదల తర్వాత ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ టాక్ ని మూటగట్టుకుంది. ప్రభాస్ తో ఇలాంటి సినిమా తీస్తావా అంటూ అభిమానులు సోషల్ మీడియా లో డైరెక్టర్ మారుతీ ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిట్టడం మొదలు పెట్టారు. అంతే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతీ సినిమా అదిరిపోయింది, తేడా కొడితే నా అడ్రస్ ఇస్తున్నాను వచ్చేయండి అంటూ చాలా పెద్ద మాటలు మాట్లాడుతాడు. ఫ్లాప్ అయినప్పటి నుండి మారుతీ ఇంటికి పోస్ట్ కార్డ్స్ పంపడం, ఫుడ్ డెలివరీ ఆర్డర్లు ఇవ్వడం, ఇలా రకరకాలుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన్ని టార్చర్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అది ఏమిటంటే, ఈ సినిమా నిడివి 4 గంటలకు పైగా వచ్చిందట.
ఎడిటింగ్ లో ఒక గంట సినిమాని లేపేశారు. ఆ గంట నిడివి సినిమా కోసం దాదాపుగా 60 కోట్ల రూపాయిలు ఖర్చు చేయించాడట డైరెక్టర్ మారుతీ. అసలు ఈ సన్నివేశం పెట్టడం అవసరమా అని డైరెక్టర్ ని నిర్మాత నిర్మాణ దశలోనే అడిగాడట, కచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి, ఆయనతో ఇష్టం లేకపోయినా ఆ సన్నివేశాలను తెరకెక్కించాడు. చివరికి ఎడిటింగ్ లో వాటిని లేపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఒక్కటా రెండా ఎన్నో దుబారా ఖర్చులు చేయించాడట డైరెక్టర్ మారుతీ. అందుకే ఈ సినిమాకు ఖర్చు అయినా బడ్జెట్ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. నష్టాలతోనే విడుదలైన ఈ చిత్రం, మరిన్ని నష్టాలను కొని తెచ్చుకుంది.