The Paradise Movie: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా మరో 20 రోజులపాటు షూటింగ్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో వీలైనంత తొందరగా ఈ సినిమాని కంప్లీట్ చేసి మరి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు రిలీజ్ డేట్ లను పోస్ట్ పోన్ చేయడంతో మూడోసారి వచ్చే రిలీజ్ డేట్ కి పక్కాగా సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనతో మేకర్స్ ఉన్నారు. ఇక ఇప్పటికే ఒక ప్రముఖ ఓటిటి సంస్థ కి సైతం ప్యారడైజ్ సినిమాను అమ్మేశారట. దాంతో ఆ ఓటిటి సంస్థ సినిమా యూనిట్ మీద కొంతవరకు సీరియస్ గా ఉందట. ఇప్పటికే సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఈ సినిమా వల్ల మాకు భారీగా లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు మీరు సినిమాని పోస్ట్ పోన్ చేయకుండా వీలైనంత తొందరగా థియేటర్లోకి తీసుకురావాలని లేకపోతే మాత్రం మేము అనుకున్న తేదీకి ఓటిటి లో రిలీజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ హెచ్చరిస్తున్నారట.
ఆ లోపు మీరు థియేటర్లోకి వచ్చిన రాకపోయినా మా డేట్ లో మాత్రం మార్పు ఉండదు అని వాళ్ళు చాలా గట్టిగా చెబుతున్నారట. దీనికి దర్శక నిర్మాతలు సైతం ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే సినిమా షూటింగ్ ను రెండు యూనిట్లుగా విభజించి చాలా ఫాస్ట్ గా జరుపుతున్నారు. ప్రస్తుతానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఫైట్ మాస్టర్ ఒక ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నాడు.
అసోసియేట్ డైరెక్టర్ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా వీలైనంత తొందరగా ఈ సినిమాని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తేనే ఈ సినిమా మీద ఉన్న అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుంది.
లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు అంటూ సినిమా మేధావులు సైతం సినిమా యూనిట్ ను హెచ్చరిస్తున్నారు… చూడాలి మరి ప్యారడైజ్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. నాని కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ గా నిలుస్తుందా లేదా అనేది…
