The Paradise Release Date: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల మధ్య ఎప్పుడు క్లాష్ వస్తుంటుంది. సినిమా రిలీజ్ డేట్లు ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది సినిమా వస్తుంది. మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చాయి…కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. దాంతో అదే రోజున పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భారత సింగ్’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఇక మార్చి 26 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ కి రెడీ చేస్తున్నారు…ఈ సినిమా తర్వాత ఏప్రిల్ లో పెద్ది సినిమాను సైతం ఏప్రిల్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.
ఇక ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నప్పటికి ప్యారడైజ్ సినిమా రిలీజ్ డేట్ మీద సరైన క్లారిటీ రావడం లేదు. గతంలో మార్చి 26వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవలేదు.
దాంతో మార్చి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవ్వడం అనేది అసాధ్యమనే చెప్పాలి. ఇక ఈ సినిమా మేలో వస్తుందా లేదంటే ఏప్రిల్ లోనే రిలీజ్ చేయడానికి తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాలో నాని డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. కాబట్టి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటున్నాడు.
ఆయన ఈ సినిమాతో ఎంత గొప్ప విజయాన్ని సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… శ్రీకాంత్ ఓదెల – నాని కాంబినేషన్లో ఇంతకుముందు దసర అనే సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించడంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ కి చాలా మంచి ఆదరణ దక్కుతుంది…