https://oktelugu.com/

సంచలన ఆరోపణ: యాంకర్ వర్షిణి చేయిపట్టి లాగిన డైరెక్టర్

  బుల్లితెరపై గ్లామర్ షో చేసే యాంకర్లలో వర్షిణి ఒకరు. అనసూయ.. రష్మి.. శ్రీముఖిలానే వర్షిణి సైతం గ్లామర్ నే నమ్ముకొని యాంకరింగ్ చేస్తోంది. కుర్రకారులో యాంకర్ వర్షిణిని ఫుల్ క్రేజీ ఉంది. ఇటీవల సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ పిక్స్ షేర్ చేసి అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది యాంకర్ వర్షిణి. Also Read: 10లక్షలు కట్టించుకున్న జబర్దస్త్.? నాగబాబు పంచ్..! ఈ భామ తాజాగా ‘అలీతో సరదాగా’ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2020 / 03:11 PM IST
    Follow us on

     

    బుల్లితెరపై గ్లామర్ షో చేసే యాంకర్లలో వర్షిణి ఒకరు. అనసూయ.. రష్మి.. శ్రీముఖిలానే వర్షిణి సైతం గ్లామర్ నే నమ్ముకొని యాంకరింగ్ చేస్తోంది. కుర్రకారులో యాంకర్ వర్షిణిని ఫుల్ క్రేజీ ఉంది. ఇటీవల సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ పిక్స్ షేర్ చేసి అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది యాంకర్ వర్షిణి.

    Also Read: 10లక్షలు కట్టించుకున్న జబర్దస్త్.? నాగబాబు పంచ్..!

    ఈ భామ తాజాగా ‘అలీతో సరదాగా’ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కెరీర్.. పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చిన్నపుడే తన పేరెంట్స్ విడిపోయారని చెప్పింది. తనకు అమ్మ.. అక్క.. అన్నయ్య మాత్రమే ఉన్నారని తెలిపింది. అమ్మే దగ్గరే తాను పెరిగానని అన్నయ్య యూఎస్ లో జాబ్ చేస్తున్నాడని తెలిపారు.

    చిన్నప్పటి నుంచి అన్నయ్య తమను జాగ్రత్తగా చూసుకునే వాడని తెలిపింది. ఎవరైనా తమకు కామెంట్ చేస్తే వెంటనే కొట్టేవాడని తెలిపింది. తన అన్నయ్య ఎప్పుడు కూడా రాడ్ పెట్టుకునే తిరిగేవాడని చెప్పింది. సినిమాకు వెళ్లినా ఒక సీట్ ఎక్కువగా బుక్ చేశాడవాడని.. ఎవరీ చేతులైనా తగులుతాయోనని అంతా జాగ్రత్తగా చూసుకునేవాడని తెలిపింది. రీసెంట్ తన అక్క మ్యారేజ్ అయిందని తెలిపింది.

    తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఇంతవరకు తాను ఓ ప్రాజెక్టు కోసం ఆఫీసులకు వెళ్లలేదని.. అన్ని అవే తన వద్దకు వచ్చాయని తెలిపింది. ఎవ్వరికీ కూడా ఫొటోలు పంపలేదని.. ఢీ ఆఫర్.. వెబ్ సిరీస్ అవకాశం కూడా తన వద్దకే వచ్చాయని తెలిపింది. ఇప్పటివరకు ఎవరినీ అవకాశం ఇమ్మని అడగలేదని వర్షిణి చెప్పింది. అయితే ఓ చేదు సంఘటన ఎదురైందని వాపోయింది.

    Also Read:అక్కినేని షోనా.? బిగ్‌బాస్‌ షోపై నెటిజన్స్ ట్రోల్స్‌

    కరోనాకు ముందే ఈ సంఘటన జరిగిందని.. చెప్పొచ్చు లేదో అన్న సందేహంలో ఉండగా హైపర్ ఆది దైర్యం ఇవ్వడంతో ఓ డైరెక్టర్ చేసిన నిర్వాహాకాన్ని షోలో బయటపెట్టింది. వెబ్ సిరీస్ కోసం తనను ఓ డైరెక్టర్ ఆఫీస్ రూంకి పిలిచి స్టోరీ చెప్పాడని చెప్పింది. అంతా బాగానే ఉందని.. అయితే కొద్దిసేపటికి సడెన్ గా తన చేయిపట్టి అతనివైపుకు లాక్కుడని చెప్పింది. ఆ ఘటనతో తాను షాక్ కు గురై వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పింది. ఈ విషయం ఒకరిద్దరికి మాత్రమే తెలుసని భావోద్వేగానికి గురైంది.