https://oktelugu.com/

ఆ దర్శకుడితో హిట్ కొట్టి తీరాల్సిందే అంటున్న బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణకు ఒక్కసారి కనెక్ట్ అయితే విడిపోవడం దాదాపు అసాధ్యం అంటారు చాలామంది దర్శకులు. అలాంటి వారిలో పూరి జగన్నాథ్ కూడ ఒకరు. మీకు ఏ హీరోతో పని చేయడం అంటే ఇష్టం అని అడిగితే బాలయ్యతో చేయడాం ఇష్టం అంటారు. అందరూ బాలయ్య కోపానికి భయపడితే పూరి మాత్రం ముచ్చటపడిపోతుంటారు. ఆయనలో చూసిన నిజాయితీ ఎక్కడా చూడలేదని అందుకే ఆయనంటే తనకు ఇష్టమని అంటుంటారు. Also Read: సంచలన ఆరోపణ: యాంకర్ వర్షిణి చేయిపట్టి లాగిన […]

Written By:
  • admin
  • , Updated On : October 27, 2020 / 05:10 PM IST
    Follow us on


    నందమూరి బాలకృష్ణకు ఒక్కసారి కనెక్ట్ అయితే విడిపోవడం దాదాపు అసాధ్యం అంటారు చాలామంది దర్శకులు. అలాంటి వారిలో పూరి జగన్నాథ్ కూడ ఒకరు. మీకు ఏ హీరోతో పని చేయడం అంటే ఇష్టం అని అడిగితే బాలయ్యతో చేయడాం ఇష్టం అంటారు. అందరూ బాలయ్య కోపానికి భయపడితే పూరి మాత్రం ముచ్చటపడిపోతుంటారు. ఆయనలో చూసిన నిజాయితీ ఎక్కడా చూడలేదని అందుకే ఆయనంటే తనకు ఇష్టమని అంటుంటారు.

    Also Read: సంచలన ఆరోపణ: యాంకర్ వర్షిణి చేయిపట్టి లాగిన డైరెక్టర్

    బాలయ్య కూడ అంతే పూరి జగన్నాథ్ టాపిక్ వస్తే హ్యాపీగా మాట్లాడతారు. పూరి డైరెక్షన్లో నటించడం అంటే తనకు ఇష్టమని అంటుంటారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘పైసా వసూల్’ అనే చిత్రం వచ్చింది. కానీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కానీ బాలయ్య నటనకు మాత్రం కొత్తగా ఉండనే ప్రశంసలు అందాయి. అయితే సినిమా హిట్టవ్వలేదనే అసంతృప్తి మిగిలిపోయిందో ఏమో కానీ బాలయ్య పూరితో ఇంకో సినిమా సెట్ చేసుకున్నారు.

    Also Read: 10లక్షలు కట్టించుకున్న జబర్దస్త్.? నాగబాబు పంచ్..!

    పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నారు. అది పూర్తైన వెంటనే బాలయ్యా ప్రాజెక్ట్ మొదలుపెడతారట. అలాగే ఈలోపు బాలయ్యా బోయపాటి సినిమాను కంప్లీట్ చేసుకుని వస్తారట. ఈ చిత్రాన్ని పూరి, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించనున్నారు. చూడబోతే బాలయ్య, పూరీలు ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని కసి మీదున్నట్టు కనిపిస్తున్నారు.