Naga Chaitanya Samantha: మొత్తానికి మన హీరో నాగచైతన్య తన మాజీ భార్య ‘సమంత’ను మరిచిపోవడం లేదని తెలిసింది. ఆయన తాజా సినిమా ‘థ్యాంక్యూ’ రిలీజ్ కు సిద్ధమైన వేళ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న చైతూ ఈ మేరకు తనకు జీవితంలో కీలకపాత్ర పోషించిన అందరికీ ‘థ్యాంక్యూ’ చెప్పాలని డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే మీడియా ముఖంగా చెప్పేశారు కూడా. అలాగే ‘Themagicwordisthankyou’ పేరుతో సోషల్ మీడియాలో తమకు ఇష్టమైన వారికి థ్యాంక్యూ చెప్పాలని పిలుపునిచ్చాడు.
విలక్షణ దర్శకుడు విక్రమ్ కే.కుమార్ దర్శకత్వంలో రాశిఖన్నా, మాళవికా నాయక్, అవికాగోర్ హీరోయిన్లుగా నాగచైతన్య హీరోగా నిర్మించిన మూవీ ‘థ్యాంక్యూ’. జులై 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా నేపథ్యాన్ని జీవితానికి అన్వయించుకున్నాడు నాగచైతన్య. ఈ సందర్భంగా తన జీవితంలో థ్యాంక్స్ చెప్పాల్సిన వారి లిస్ట్ తీసి చెప్పేశాడు.
అందరికంటే ముందుగా నాగచైతన్య తన ‘అమ్మ’కు థ్యాంక్యూ చెప్పాడు. ఆ తర్వాత నాన్న నాగార్జున ‘తనకో ఓ దారి చూపించిన స్నేహితుడు’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఆ తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచేలా నాగచైతన్య ఒకరికి థ్యాంక్యూ చెప్పడం విశేషం. అది ఎవరో కాదు.. ‘సమంత ముద్దుగా పెంచుకున్న కుక్కపిల్ల ‘హాష్’.
అవును ఎలాగూ సమంతతో విడాకులు తీసుకోవడంతో ఆమెకు నాగచైతన్య ‘థ్యాంక్స్’ చెప్పలేడు. అందుకే 2017లో సమంతతో వివాహమైన తర్వాత ఇద్దరూ కలిసి పెంచుకున్న ‘హాష్’ అనే కుక్కపిల్లను నాగచైతన్య తాజాగా గుర్తు చేసుకున్నారు. ‘హాష్.. ప్రేమించడం ఎలాగో తెలిసేలా చేసి, నన్ను ఒక మనిషిగా ఉంచినందుకు థ్యాంక్యూ’ అని చైతన్య ఎమోషనల్ అయ్యారు.
అసలు ‘కుక్క పిల్ల’కు థ్యాంక్యూ చెప్పడం ఏంటని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘సమంత’కు చెప్పలేకనే.. ఆమె వద్దే ప్రస్తుతం ఉన్న ‘హాష్’కు ఇలా చైతన్య చెప్పి ఇలా కవర్ చేస్తున్నాడని కొందరు అంటున్నారు.
సమంత-నాగచైతన్య విడిపోయాక ఈ కుక్కపిల్ల హాష్ సమంత వద్దే ఉంటోంది. ఇప్పుడు నాగచైతన్య చెప్పిన థ్యాంక్స్ మరి ఈ హాష్ కా.? లేక సమంతకా? అని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Chor Baazar Collections: ‘చోర్ బజార్’ ‘క్లోజింగ్ కలెక్షన్స్’.. ఎన్ని కోట్లు లాస్ అంటే ?