Prabhas With Disaster Director: బాహుబలి సినిమా తో ఎవ్వరు చూడని అనితర సాధ్యమైన స్టార్దమ్ ని చూసాడు మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ఒక్కప్పుడు నలుగురి స్టార్స్ లో ఒకడిగా నిలిచినా ప్రభాస్..ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి బాస్ గా మారిపోయాడు..ఆయన డిజాస్టర్ సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద కొంతమంది స్టార్ హీరోలతో సమానమైన కలెక్షన్స్ ని వసూలు చేస్తాయి..సాహూ సినిమా ఫ్లాప్ టాక్ తోనే అప్పట్లో 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది..ఇక ఆ తర్వాత విడుదలైన రాధే శ్యామ్ సినిమా కూడా డిజాస్టర్ టాక్ తోనే దాదాపుగా 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఇంతటి స్టార్ స్టేటస్ ఉన్న ప్రభాస్ సరైన సినిమా తీస్తే ఎలా ఉంటుందో మన ఊహకి కూడా అందదు అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు..అయితే ప్రభాస్ ఇప్పుడు తీసుకున్న ఒక్క సరికొత్త నిర్ణయం ఆయన అభిమానులను కంగారు పెట్టేలా చేస్తుంది.
Also Read: Reasons Behind Modi South Tour: మోడీ దక్షిణరాగం వెనక కారణాలు ఏంటి?
ఇక అసలు విషయానికి వస్తే ఇటీవలే కొరటాల శివ ఆచార్య సినిమాతో కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ఆయనని ఒక టెక్నిషియన్ గా మరియు ఒక పంపిణీదారుడిగా దారుణంగా దెబ్బ తీసింది..అలాంటి ఫ్లాప్ సినిమా తీసిన తర్వాత కొరటాల శివ తో సినిమాలు చెయ్యడానికి ఎవ్వరు కూడా ఆసక్తి చూపారు అని అందరూ అనుకున్నారు..కానీ ఆ సినిమా తర్వాత ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..అలాగే అతి త్వరలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి..రచయితగా కొనసాగుతున్న కొరటాల శివ ని మిర్చి సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం చేసింది ప్రభాస్ గారే..ఇప్పుడు మరోసారి ఆయన కొరటాల శివ తో జతకట్టబోతుండడం విశేషమే అయినా..కొరటాల ప్రస్తుతం ఉన్న ఫామ్ ని చూసి ప్రభాస్ అభిమానులు భయపడిపోతున్నారు..కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడు ఇలాంటి డైరెక్టర్స్ తో ఎందుకు అని ఆయన అభిమానులు వర్రీ అవుతున్నారు..నిజానికి ఆచార్య సినిమాని చూసిన తర్వాత ఎవరికైనా ఇలాంటి అభిప్రాయం కలగడం సర్వసాధారణం..ఎందుకంటే అంత చెత్తగా ఆ సినిమాని తీసాడు కాబట్టి..కానీ కొరటాల లో విషయం ఇంకా ఉంది అని నమ్మారు కాబట్టే ఎన్టీఆర్ , ప్రభాస్ వంటి వారు అవకాశాలు ఇస్తున్నారు..మరి వాళ్ళు ఇస్తున్న అవకాశాలను కొరటాల శివ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.
Also Read: Revanth Reddy: ఏడాది ప్రస్థానం: కాంగ్రెస్ ను ఏకం చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఏడాదిలో ఏం చేశాడు?