https://oktelugu.com/

The Ghost Poster: ”ది ఘోస్ట్” లుక్ తో షాక్ ఇచ్చిన నాగార్జున.. పోస్టర్ వైరల్

The Ghost Poster: కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కలయికలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ”ది ఘోస్ట్” రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ కి కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను స్టార్ట్ చేసింది చిత్రబృందం. ‘మీ అందరికీ వెన్నులో వణుకు పుట్టించే ‘ది ఘోస్ట్’ ఫస్ట్ విజువల్ ను జులై 9న రిలీజ్ చేస్తున్నాం అంటూ టీమ్ అనౌన్స్మెంట్ […]

Written By: , Updated On : July 7, 2022 / 02:10 PM IST
Follow us on

The Ghost Poster: కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కలయికలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ”ది ఘోస్ట్” రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ కి కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను స్టార్ట్ చేసింది చిత్రబృందం. ‘మీ అందరికీ వెన్నులో వణుకు పుట్టించే ‘ది ఘోస్ట్’ ఫస్ట్ విజువల్ ను జులై 9న రిలీజ్ చేస్తున్నాం అంటూ టీమ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ను వదిలింది.

The Ghost Poster

Nagarjuna

ఈ పోస్టర్ లో నాగ్ లుక్ చాలా వైల్డ్ గా ఉంది. “కిల్లింగ్ మెషీన్ ని వదులుతున్నాం” అని పోస్టర్ లో చెప్పినట్టుగానే పోస్టర్ లో యాక్షన్ లుక్ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా నాగార్జున రెండు చేతులతో ఒక పెద్ద కత్తిని పట్టుకుని కనిపించాడు. బ్యాగ్రౌండ్ లో నాగ్ తల వెనుక ఎర్రబడిన చంద్రుని ఇమేజ్ కూడా చాలా బాగుంది. పైగా ఫార్మల్ సూట్ లో నాగ్ చాలా క్రూరంగా చూస్తూ కనిపించడంతో మొత్తమ్మీద ఈ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Also Read: Naga Chaitanya Samantha: ప్రేమించడం నేర్పించింది నువ్వే.. నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఈ పోస్టర్ ను చూస్తుంటేనే ఈ సినిమా పక్కా యాక్షన్ ప్యాక్ గా ఉండటం ఖాయంగా అనిపిస్తోంది. ఈ ”ది ఘోస్ట్”లో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త నాగార్జునను ఈ సినిమాలో చూస్తారట. అయితే నాగార్జున ఇమేజ్ కి ఇలాంటి సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Nagarjuna

Nagarjuna

 

నాగ్ ఫ్యాన్స్ మాత్రం నాగార్జున నుంచి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కథ ప్రకారం దర్శకుడు ప్రవీణ్ సత్తారు, నాగార్జున పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేసాడట. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన అందాల భామ సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మొత్తానికి ”ది ఘోస్ట్” లుక్ తో షాక్ నాగార్జున ఇచ్చాడు.

అన్నట్టు ఆ మధ్య ఈ సినిమాలోని నాగార్జున లుక్ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. వైరల్ అయిన ఆ లుక్ లో నాగార్జున పూర్తిగా రఫ్ లుక్ లో, పెరిగిన మీసకట్టుతో కనిపించి మొత్తానికి అందరికి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా అలాగే ఆకట్టుకున్నాడు.

Also Read:Extramarital Affair: ప్రియుడి కోసం అతడి భార్య, అత్తను తగలబెట్టేసింది.. ఓ వివాహిత దుశ్చర్య

Tags