
ఎంత సొంత ఓటీటీ మాత్రం స్టైలిష్ స్టార్ మెగాస్టార్ అయిపోతాడా? అని ఇప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నాడు. ఈ వివాదాన్ని రేపింది ‘ఆహా’ ఓటీటీ కాగా.. విమర్శలను ఎదుర్కోంటోంది మాత్రం అల్లు అర్జున్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సమంత హోస్ట్ గా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారం అవుతున్న షోకు గెస్ట్ గా వెళ్లాడు. ఆయన షో తాలూకా ప్రోమో తాజాగా విడుదలైంది. దీన్ని నూతన సంవత్సరం 1వతేదీన ఆహా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఈ అల్లు అర్జున్-సమంత ప్రోమోలో స్టైలిష్ స్టార్ బన్నీని ‘మెగాస్టార్’ అంటూ వేయడం పెద్ద దుమారం రేపింది. మెగాస్టార్ చిరంజీవి హోదాను ఇలా బన్నీకి అంటగట్టి ఆహా ఓటీటీ వారు రిలీజ్ చేసి ప్రోమోపై మెగా ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అయితే తప్పు దిద్దుకున్న ఆహా టీం వెంటనే మెగాస్టార్ పదం తీసేసి స్టైలిష్ స్టార్ అని పెట్టేసింది. అయినా కొందరు స్క్రీన్ షాట్స్ తీసుకొని హోరెత్తిస్తున్నారు.
ఇది అల్లు అర్జున్ కు తెలిసి జరిగిందో లేక అత్యుత్సాహంతో చేశారో ఏమో కానీ బన్నీని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఎంత ఆహా ఓటీటీ అల్లు అరవింద్ ది అయితే మాత్రం ఇలా మెగా స్టార్ తో పోలికనా అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.