https://oktelugu.com/

మెగా క్యాంపులో ఇరుక్కుపోయిన కొరటాల?

టాలీవుడ్లో అపజయం లేకుండా దూసుకుపోతున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కొరటాల శివ దర్శకుడిగా తీసిందే కేవలం నాలుగు సినిమాలే అయిన అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లోకి రచయిత ఎంట్రీ ఇచ్చిన కొరటాల శివ 2013లో ‘మిర్చి’తో దర్శకుడిగా మారిపోయాడు. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. దీంతో అతడు వెనుతిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. వరుసగా అగ్రహీరోలతో సినిమాలు చేసే అవకాశాలను కొరటాల దక్కించుకున్నాడు. మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’.. ఎన్టీఆర్ తో ‘జనతా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2020 4:35 pm
    Follow us on

    టాలీవుడ్లో అపజయం లేకుండా దూసుకుపోతున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కొరటాల శివ దర్శకుడిగా తీసిందే కేవలం నాలుగు సినిమాలే అయిన అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లోకి రచయిత ఎంట్రీ ఇచ్చిన కొరటాల శివ 2013లో ‘మిర్చి’తో దర్శకుడిగా మారిపోయాడు. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. దీంతో అతడు వెనుతిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది.

    వరుసగా అగ్రహీరోలతో సినిమాలు చేసే అవకాశాలను కొరటాల దక్కించుకున్నాడు. మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’.. ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజీ’.. మళ్లీ మహేష్ తో ‘భరత్ అనే నేను’ సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచాయి. 2018 ఏప్రిల్లో ‘భరత్ అనే నేను’ రిలీజు కాగా ఇప్పటివరకు అతడి నుంచి మరో సినిమా రాలేదు.

    దాదాపు రెండేళ్లుగా కొరటాల శివ నుంచి సినిమా రాలేదు. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగు సమయంలోనే కరోనా రావడంతో సినిమా నిలిచిపోయింది. 2021లో ‘ఆచార్య’ను విడుదల చేయాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా పట్టాలెక్కుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

    ఈ మూవీలో రాంచరణ్ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ ఆలస్యం కారణంగా ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యేలా కన్పిస్తోంది. దీంతో ఈ ఏడాది కూడా ఆయన సినిమా రావడం కష్టంగా కన్పిస్తోంది. దీంతో ఓ టాప్ డైరెక్టర్ మూడేళ్ల కాలం ఓ సినిమాపై గడిచిపోయిందనే టాక్ విన్పిస్తోంది. రాజమౌళి తెరకెక్కించే ‘బాహుబలి’ సినిమా కాకపోయిన మెగాస్టార్ సినిమా కోసం కొరటాల సమయం వృథా అయినట్లు కన్పిస్తోంది.

    దీనికి తోడు కరోనా.. ఆర్ఆర్ఆర్ ప్రభావం ‘ఆచార్య’ మూవీపై పడుతోంది. ఈ సినిమా తర్వాత కొరటాల-అల్లు అర్జున్ కాంబోలో ఈ సినిమా రానుంది. ఆచార్య సినిమా పూర్తయితేగానీ కొరటాల మరో సినిమాకు వెళ్లే అవకాశం లేదు. దీంతో కొరటాల ఎరక్కపోయి మెగా క్యాంపులో ఇరుక్కుపోయాడనే కామెంట్లు విన్పిస్తోంది. మొత్తానికి కొరటాల భవిష్యత్ ‘ఆచార్య’పైనే ఉందని తెలుస్తోంది.