https://oktelugu.com/

మహేష్ హీరోయిన్ కు మగబిడ్డ పుట్టాడు

మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ అంటే ఆ స్థాయే వేరు. ఆయనతో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఎందుకంటే మహేష్ బాబుతో సినిమా అంటేనే సగం స్టార్ స్టేటస్ వచ్చేసినట్టే. ఇక ఆ చిత్రం గనుక హిట్టైతే క్రేజే వేరు. అందుకే మహెహ్స్ బాబుతో ఒక్కసారైనా నటించాలని హీరోయిన్లు కోరుకుంటారు. అలాంటిది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడమే మహేష్ సినిమాలో అవకాశం వస్తే. సరిగ్గా ఇదే గోల్డెన్ ఛాన్స్ అమృతారావుకు వచ్చింది. మహేష్ యొక్క […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 2, 2020 / 05:32 PM IST
    Follow us on


    మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ అంటే ఆ స్థాయే వేరు. ఆయనతో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఎందుకంటే మహేష్ బాబుతో సినిమా అంటేనే సగం స్టార్ స్టేటస్ వచ్చేసినట్టే. ఇక ఆ చిత్రం గనుక హిట్టైతే క్రేజే వేరు. అందుకే మహెహ్స్ బాబుతో ఒక్కసారైనా నటించాలని హీరోయిన్లు కోరుకుంటారు. అలాంటిది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడమే మహేష్ సినిమాలో అవకాశం వస్తే. సరిగ్గా ఇదే గోల్డెన్ ఛాన్స్ అమృతారావుకు వచ్చింది. మహేష్ యొక్క ‘అతిథి’ చిత్రంతో ఆమె తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించింది.

    Also Read: పారితోషికం ఎక్కువిస్తే ఎవరైనా ఒకే అంటున్న రష్మిక..!

    ఆ చిత్రంలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన వారంతా ఆమె పెద్ద హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారు. కానీ ఎందుకో అమృతరావు ఆ తర్వాత మరొక తెలుగు సినిమా చేయలేదు. అదే ఆమె మొదటి, ఆఖరు తెలుగు చిత్రం. ఆ సినిమాతో తెలుగుకు బై బై చెప్పేసి పూర్తిగా హిందీ పరిశ్రమకే పరిమితమైంది. హిందీలో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఆర్జే ఆన్‌మోల్ తో ప్రేమలో పడింది. ప్రేమ వ్యవహారాన్ని చాలా గోప్యంగా నడిపిన అమృతారావు పెళ్లిని కూడ సీక్రెట్ గా చేసుకుంది. పెళ్ళైన కొన్ని నెలలకు ఆ సంగతి బయటపడింది.

    Also Read: ఎన్టీఆర్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

    ఇక తాజాగా ఆమె తాను గర్భవతిని అయిన సంగతిని కూడ దాచిపెట్టింది, నిండు నెలలతో చెకప్ కోసం ఆమె ఆసుపత్రికి రాగా ఆమెను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. అప్పుడే ఆమె గర్భవతి అని తెలిసింది., ఇక తాజాగా ఆమెకు మగబిడ్డ పుట్టాడు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు ఆమె బృందం సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అమృతా, ఆర్జే ఆన్‌మోల్‌ దంపతులకు ఇది మొదటి సంతానం. ఈ సంగతి తెలిసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ ప్రముఖులు సైతం అమృతరావు దంపతులను అభినందిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్