తెలంగాణలో రాష్ట్రపతి పాలన.! హెచ్చరించిన బీజేపీ 

దుబ్బాక వేదికగా తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నువ్వానేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. గెలుపు కోసం వేయని ఎత్తు లేదు.. సవాల్ చేయని అంశం లేదు. అధికార టీఆర్ఎస్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లని బీజేపీ తాగిస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉండడంతో దుబ్బాక బీజేపీ అభ్యర్థి ఆర్థికమూలాలపై టీఆర్ఎస్ కొడుతోంది. ఇప్పటికే కోటి యాభై లక్షల వరకు రఘునందన్ బంధువుల వద్ద డబ్బును సీజ్ చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ ఆందోళనలతో […]

Written By: NARESH, Updated On : November 2, 2020 4:10 pm
Follow us on

దుబ్బాక వేదికగా తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నువ్వానేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. గెలుపు కోసం వేయని ఎత్తు లేదు.. సవాల్ చేయని అంశం లేదు. అధికార టీఆర్ఎస్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లని బీజేపీ తాగిస్తోంది.

తెలంగాణలో అధికారంలో ఉండడంతో దుబ్బాక బీజేపీ అభ్యర్థి ఆర్థికమూలాలపై టీఆర్ఎస్ కొడుతోంది. ఇప్పటికే కోటి యాభై లక్షల వరకు రఘునందన్ బంధువుల వద్ద డబ్బును సీజ్ చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ ఆందోళనలతో అట్టుడికి పోతోంది.

ఇక బీజేపీ హైదరాబాద్ లో కుట్ర చేసిందని.. అల్లర్లు, కాల్పులు జరిగేలా ప్లాన్ చేసిందని మంత్రి కేటీఆర్ ఆరోపించడం సంచలనమైంది. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో ఆడుతూ పాడుతూ కవితను ఓడించిన మేము.. దుబ్బాక ఎన్నికల కోసం లాఠీచార్జి చేయించుకోవడం.. కార్యకర్తల రక్తం చిందించుకునే స్థాయికి దిగజారుతామా అని అరవింద్ అన్నారు.

సిద్దిపేటలో బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారిని నియమించిందని అన్నారు. దుబ్బాకలో ఓడిపోతామన్న భయంతోనే కేటీఆర్ అక్కడికి వెళ్లడం లేదని ఆరోపించారు. దుబ్బాకలో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ధరణి, రైతు వేదికల పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

బీజేపీ కార్యకర్తలపై కాల్పులు జరిపితే అది టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహించిన హింస అవుతుందని.. కాల్పులు, లాఠిచార్జి జరుపుతామని బీజేపీని బెదిరిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అన్నారు. అదే జరిగితే తెలంగాణలో రాష్ట్రపతి పాలన వస్తుందని గుర్తుంచుకోవాలని కేటీఆర్ ను హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.