Prabhas Spirit latest updates: సందీప్ రెడ్డి వంగ – ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ పాత్రలో ప్రభాస్ చాలా పవర్ ఫుల్ గా నటించబోతున్నారట. ఇప్పటివరకు ప్రేక్షకులు అతన్ని చూడని విధంగా సందీప్ చూపిస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అతని తాత క్యారెక్టర్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించబోతుందట. తాత పాత్రకి కూడా ఒక స్పెషల్ ఎలివేషన్ సీన్స్ అయితే ఉన్నాయట. ఇంతకీ ఆ తాత పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయంలోనే సరైన క్లారిటీ రావడం లేదంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తాత గా ఒక బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్ననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తాత క్యారెక్టర్ ను పోషించే హీరో ఎవరు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అమితాబచ్చన్ ఈ సినిమాలో ప్రభాస్ తాత క్యారెక్టర్ ని పోషిస్తున్నారంటూ కొంతమంది చెబుతున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలీదు కానీ మొత్తానికైతే ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. తాత నుంచి వచ్చిన జీన్స్ తోనే తను పవర్ ఫుల్ గా తయారయ్యాడు అంటూ చెప్పే ఒక సన్నివేశం కూడా ఈ సినిమాలో ఉందట.
అందుకోసం మొదటగా అతని వీరత్వాన్ని చూపించి ఆ తర్వాత తనని ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రభాస్ ని చాలా గ్రాండీయర్ గా చూపించబోతున్నారట. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే స్పిరిట్ మూవీ సూపర్ సక్సెస్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…