Mahesh Srileela : ఇటీవల ఇండస్ట్రీ కి పరిచయమైనా కొంతమంది కుర్ర హీరోయిన్స్ లో యూత్ మరియు మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న వారిలో ఒకరు శ్రీ లీల..గత ఏడాది శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా నటించిన ‘పెళ్లి సందడి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా శ్రీలీల, తొలి సినిమాతోనే తన అందం , అభినయం మరియు డ్యాన్స్ తో ఆకట్టుకున్న ఈ అమ్మడు , రెండవ సినిమాతో మరింత క్రేజ్ ని పెంచుకుంది.

కేవలం ఈమెని చూసేందుకు థియేటర్స్ కి వెళ్లే యూత్ సంఖ్య చాలా ఎక్కువే..అందుకే ఇప్పుడు ఈమె డేట్స్ కోసం టాలీవుడ్ బడా హీరోలు మరియు బడా నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు..త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతున్న మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో కూడా ఈమెకి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చింది..మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది..అయితే ఈ సినిమాలో నటించడానికి ఆమె కోరుతున్న డిమాండ్స్ చూస్తుంటే ‘వామ్మో..ఇంత తలపొగరు అవసరమా’ అని అనిపించక తప్పదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అంటే అదృష్టం లాగ భావిస్తారు అందరూ..ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో ఉన్న క్రేజీ హీరోయిన్స్ కూడా మహేష్ తో సినిమాలు చెయ్యడం కోసం ఎగబడతారు..కానీ శ్రీలీల మాత్రం తనకి ఉన్న తలపొగరు ని చూపిస్తూ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ చెయ్యడానికి ఆమె ప్రస్తుతం తనకి వస్తున్నా రెమ్యూనరేషన్ కి మూడింతలు ఎక్కువ ఇస్తే చేస్తుందట..అంతే కాకుండా లొకేషన్ లో ఈమె ఉన్నంతసేపు అన్ని రకాల సదుపాయాలు ఉండాలట.
తనకంటూ ఒక ప్రత్యేకమైన కార్ వ్యాన్ ఏర్పాటు చేయాలట..ఇలా గొంతెమ్మ కోరికలు ఎన్నో కోరేసరికి నిర్మాత ఆమెకి నమస్కారం చేసి సినిమా నుండి ఆమెని తప్పించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లోనే ఇలాంటి ప్రవర్తన ఉంటే పైకి ఎదగడం కష్టం..అందం మరియు టాలెంట్ ఉంటే సరిపోదు అంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో శ్రీ లీల పై విరుచుకుపడుతున్నారు.