ABN RK Opinion : జర్నలిజంలో విధేయత నానాటికి పెరిగిపోతోంది.. ప్రభుభక్తి రోజురోజుకు ఎక్కువవుతోంది.. అయితే వీటిలో ఎల్లో మీడియా రెండు ఆకులు ఎక్కువే చదివింది.. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో వ్యక్తి పూజను ఎలా చేయాలో చేసిన, చూపిన ఘనత ఆ మీడియాకే దక్కుతుంది. ఇందులో మిగతా పేపర్లన్నీ, ఛానళ్ళన్నీ జుజుబి. ఇక ఎల్లో మీడియాలో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ది అందే వేసిన చెయ్యి. అందుకే వారం వారం తన పత్రికలో రాసే “కొత్త పలుకు”లో తన ఒకప్పటి పెట్టుబడి దారు చంద్రబాబు నాయుడుని అహో ఓహో అని కీర్తిస్తుంటాడు.. 2002 లో పున: ప్రారంభమైన నాటి నుంచి వరకు చంద్రబాబు నాయుడిని ఏనాడు కూడా కించిత్ మాట అనలేదు. అనడు కూడా. ఒకవేళ బాబుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి అడ్డు వచ్చినా, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి అడ్డువచ్చినా, కెసిఆర్ అడ్డువచ్చినా, నరేంద్ర మోడీ అడ్డు వచ్చినా ఎదురు నిలబడతాడు.. వారందరినీ తన పత్రికలో నిలబెడతాడు. ఆ వార్తలు అడ్డదిడ్డంగా ఉన్నప్పటికీ తనదే పైచేయి అని కవర్ చేసుకుంటాడు.

జగన్ ది తప్పే
ఈరోజు రాసిన కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్కే చంద్రబాబు నాయుడుని అమాంతం ఆకాశానికి ఎత్తాడు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా అటాక్ చేశాడు. బహుశా ఈ యాంగిల్ చంద్రబాబు నాయుడు మెదడుకి కూడా తట్టి ఉండదు కాబోలు. అంతలా రెచ్చిపోయాడు. ఒంటికి పసుపు రంగు పూసుకుని చర్నా కోల్ దెబ్బలతో “బాబు బాబు” అనుకుంటూ కొట్టుకున్నాడు.. వాస్తవానికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జీవో తప్పు అనుకుందాం. మరి చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏమిటి? నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనకు ఎవరు బాధ్యులు? గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న మరణాలకు కారణం ఎవరు? పోలీసులు అదుపు చేయలేదు సరే… మరి అంత చిన్న స్థలంలో ఆ స్థాయిలో మీటింగ్ ఎలా పెడతారు? ఈ ప్రశ్నలు మనం రాధాకృష్ణ అడిగితే సమాధానం ఉండదు. ఎందుకంటే ఆయన దృష్టిలో చంద్రబాబు సర్వ పరిత్యాగుడు.. చనిపోయిన కార్యకర్తలు అసలు మనుషులే కాదు.
అదుపు చేయాల్సిన సోయి చంద్రబాబుకు లేదా
మొన్న ఖమ్మంలో చంద్రబాబు మీటింగ్ పెడితే ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు.. ఏ ఒక్క ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు.. ఎందుకంటే ఆ మీటింగ్ పెట్టిన ప్రాంగణం విస్తారమైనది కాబట్టి… మరోవైపు కార్యకర్తలు కూడా చాలా క్రమశిక్షణ పాటించారు కాబట్టి.. గుంటూరు, నెల్లూరులో జరిగిన సభలకు సంబంధించి అక్కడ ప్రాంగణాలు చాలా చిన్నవిగా ఉన్నాయి.. పైగా కార్యకర్తలు రావడంతో ఆ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది.. దీనికి తోడు కొందరు కార్యకర్తల అతి ప్రవర్తన వల్ల అక్కడ గందరగోళం నెలకొంది. తొక్కిసలాట జరిగి కార్యకర్తల ప్రాణాలు పోయాయి. ఇదంతా క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నప్పటికీ రాధాకృష్ణకు మాత్రం జగన్ తెచ్చిన జీవో ఒకటి మాత్రమే కనిపిస్తోంది.. అంటే ఈ లెక్కన కార్యకర్తల వి ప్రాణాలు కాదా రాధాకృష్ణ గారు?!
మరి వీరికి సంఘీభావం ఏది
వ్యాసం మొత్తం టిడిపి నాయకులు మాట్లాడినట్టుగానే ఉంది.. మరి చనిపోయిన కార్యకర్తలకు సంబంధించి ఒక్క సంఘీభావ ప్రకటన కానీ, సంతాపం వ్యక్తం చేయడం గాని రాధాకృష్ణ చేయలేదు.. కనీసం ఆయన అక్షరాల్లో ఆ తాలూకు బాధ కూడా కనిపించలేదు.. ఎంతసేపటికి బాబును జాకీలు పెట్టి లేపే ప్రయత్నం తప్ప.. 2019 లోనూ ఇలానే లేపి లేపి 23 దగ్గర కూర్చోబెట్టారు.. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ అక్కడ ఉన్నది జగన్…మోనో పోలికి నిలువెత్తు ఎగ్జాంపుల్. అంతకుమించి రాధాకృష్ణకు చెప్పాల్సింది ఏమీ లేదు.. అఫ్కోర్స్ రాధాకృష్ణ కూడా కొత్త పలుకును మించి రాసేది కూడా ఏమీ ఉండదు.. ఇలాంటి కొత్త పలుకులు జగన్మోహన్ రెడ్డి చాలానే చూశాడు..