SKN Shocking Comments: యంగ్ హీరోల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని జనాలకు అత్యంత చేరువ చేయడం కోసం , మేకర్స్ భారీ లెవెల్ లో ప్రొమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల అయ్యే ముందు రోజే , తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ కూడా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ కి సౌత్ లో పీక్ రేంజ్ క్రేజ్ ఉంది , ఆయన సినిమాతో పోటీ పడడం అవసరమా అని రీసెంట్ గా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విలేఖరులు కిరణ్ అబ్బవరం ని అడగ్గా, మా సినిమా పై మాకు చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా విజయం సాధిస్తుంది , ఎవరొచ్చినా సరే , మేము కూడా అదే తేదీన రాబోతున్నాము, మన తెలుగు ఆడియన్స్ ముందుగా తెలుగు హీరోనే ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం.
ఇదే ప్రెస్ మీట్ లో మరో రిపోర్టర్ కిరణ్ అబ్బవరం ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు నటించిన ‘క’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది , కానీ రీసెంట్ గా ఆ చిత్ర నిర్మాత , మాకు ‘క’ నుండి పెద్దగా డబ్బులు రాలేదని అన్నారు, దీనికి మీరేమి సమాధానం చెప్తారు?’ అని అడగ్గా , అందుకు కిరణ్ అబ్బవరం సమాధానం చెప్తూ ‘మాది చాలా చిన్న సినిమా, మిగిలిన సినిమాలతో పోలిస్తే భారీ రేంజ్ లో వసూళ్లు వచ్చి ఉండకపోవచ్చు , కానీ కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిల్చింది. విడుదలకు ముందే ఈ సినిమాని బయ్యర్స్ కి అమ్మేశాం. సినిమా ఏ స్థాయిలో ఆడింది , ఎంత వసూళ్లు వచ్చాయి అనేది మీ దగ్గర రికార్డ్స్ రూపం లో సమాచారం ఉండే ఉంటుంది కదా, మళ్లీ ఇలాంటి ప్రశ్నలు అడగడం ఎందుకు’ అంటూ చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం.
అనంతరం నిర్మాత SKN మైక్ అందుకొని ‘ఒక సినిమా భారీ హిట్ అయ్యినంత మాత్రానా నిర్మాతలకు భారీ లాభాలు రావు. నా బేబీ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రానికి రావాల్సిన డబ్బులు నా వరకు చేరలేదు , చాలా మంది ఎగ్గొట్టారు. నిర్మాతలకు ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటిని మీరు అర్థం చేసుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చారు SKN . వీళ్లిద్దరు మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ‘క’, ‘K ర్యాంప్ ‘ వంటి వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న కిరణ్ అబ్బవరం , ‘చెన్నై లవ్ స్టోరీ’ తో ఆ ఊపుని ముందుకు కొనసాగిస్తారో లేదో చూడాలి.
