Singer Mangli Controversy: గత కొద్దిరోజులు గా ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer mangli) అలియాస్ సత్యవతి చుట్టూ నడుస్తున్న వివాదాలను మనం చూస్తూనే ఉన్నాం . మైక్రో ఫైనాన్స్ పేరుతో ఆమె ఎంతో మంది అమాయకుల చేత పెట్టుబడులు పెట్టించి, వాళ్ళని మోసం చేసిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ అంశంపై పై మంగ్లీ కూడా స్పందిస్తూ , తనని కావాలని ఎవరో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. ఈ అంశం పై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే మరోపక్క సింగర్ మంగ్లీ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలంటూ రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ మేరకు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్, మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
మంగ్లీ చేత మోసగింపబడిన నిరుపేద కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆమెని సినీ ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలంటూ సంపత్ నాయక్ డిమాండ్ చేశాడు. మరి ఆమె పై మా అస్సోసియేషన్ యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. సినీ ఇండస్ట్రీ లో మంగ్లీ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా ఇప్పుడు విడుదలయ్యే ప్రతీ సినిమాలోనూ ఈమె పాట ఉండాల్సిందే. ఆ రేంజ్ డిమాండ్ ని సొంతం చేసుకుంది. ఇక ఈమె అప్పుడప్పుడు చేసే యూట్యూబ్ ప్రైవేట్ వీడియోస్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. రీసెంట్ గానే ఆమె పాడిన ‘బాయిలోనే పల్లి పడితే’ అనే పాట ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతే కాకుండా , సినిమాల ద్వారా ఆమె ఎన్నో కోట్ల రూపాయిలు సంపాదిస్తూ ముందుకు వెళ్తోంది , ఇలాంటి సమయం లో ఆమెని ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేస్తే , ఆమె కెరీర్ పై బలమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.