Pawan Kalyan Health: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తీవ్రమైన అస్వస్థతకు గురి అవ్వడం తో వెంటనే ఆయన్ని హాస్పిటల్ లో చేర్చి, కీలకమైన సర్జరీ ని చేయించిన సంగతి తెలిసిందే. శుక్రవారం రోజున పాలనాపరమైన చర్చల కోసం ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యినప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని సర్జరీ పూర్తి అయ్యాక నిన్న సాయంత్రం సోషల్ మీడియా లో జనసేన పార్టీ హ్యాండిల్ ద్వారా తెలియజేసారు. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుండి అభిమానుల్లో తీవ్రమైన ఆందోళన ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు దేవుడితో సమానంగా కొలిచే సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు సంబంధించిన శుభవార్తలు ఒక పండుగ లాగా ఎలా అయితే జరుపుకుంటారో , చేదు వార్తలకు కూడా అంతలా క్రుగిపోతారు , భయాందోళనలకు గురి అవుతుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవుళ్ళకు ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తున్నారు ఫ్యాన్స్.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా సినీ సెలబ్రిటీలు , రాజకీయ నాయకులు ట్వీట్లు వేస్తూ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, తెలంగాణ ప్రతిపక్ష నేత కేటీఆర్ మరియు ప్రముఖ రాజకీయనాయకులందరూ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ వేయగా , మన టాలీవుడ్ నుండి ఇప్పటి వరకు ప్రముఖులలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే రెస్పాన్స్ ఇచ్చాడు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేస్తూ , పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ క్రింద పవన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తూ కామెంట్స్ చేయగా , ఎన్టీఆర్ అభిమానులు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేశారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి ముందుగా సాయి ధరమ్ తేజ్ రెస్పాన్స్ ఇచ్చాడు.
సాధారణంగా ఇలాంటి ఘటనలు తమ కుటుంబం లో జరిగినప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్పందన ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మార్క్ శంకర్ కి ప్రమాదం జరిగినప్పుడు స్వయంగా చిరంజీవి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉండేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సర్జరీ కి కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఒక సందేశం అందించాడు. పవన్ కళ్యాణ్ కి సర్జరీ జరిగిందని , ఇప్పుడు వేగంగా రీకవర్ అవుతున్నదని , నా తమ్ముడు త్వరగా కోలుకోవాలని మీరంతా చేసిన ప్రార్థనలు , చూపించిన ప్రేమకు ధన్యవాదాలు , వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు, కానీ ఇంకా ముందే రీకవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్ వేసాడు.
Kalyan Babu has successfully undergone a medical procedure and is now safe, stable, and recovering well.
As per the doctors, it may take about a week for him to return to his normal routine. There is no cause for concern.
Thank you all for your love, concern, and prayers. Let…
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 19, 2026