Nani Bloody Romeo: ‘ఓజీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ సుజిత్ నాని తో ‘బ్లడీ రోమియో’ అనే చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది అనే దానిపై స్పష్టమైన క్లారిటీ లేదు. జూన్ నెలలో మొదలు అవుతుందని అంతా అనుకున్నారు, కానీ ‘ది ప్యారడైజ్’ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి , ఈ ఏడాది చివర్లో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసాడు సుజిత్. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశాడు .
లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ సినిమాకు హీరోయిన్ ని కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది. ‘నా సామి రంగ’ చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆశికా రంగనాథ్ ని ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. కన్నడ లో కుర్ర హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ కి , టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ‘నా సామి రంగ’ చిత్రం తర్వాత ఈమె టాలీవుడ్ లో ‘విశ్వంభర’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ‘విశ్వంభర’ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది, ఇక ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈమె హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు కూడా ఆశించినంత స్థాయిలో ఆడలేదు.
మరి అలాంటి హీరోయిన్ ని ఎంచుకోవడం వల్ల ‘బ్లడీ రోమియో’ కి నెగటివ్ అవుతుందా అంటే కచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే పలానా హీరోయిన్ ఉండడం వల్ల సినిమా సక్సెస్ ఆధారపడి ఉంది అని చెప్పలేం , కేవలం స్క్రిప్ట్ బలం ఆధారంగానే ఒక సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ‘బ్లడీ రోమియో’ స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటే , దాని బాక్స్ ఆఫీస్ ఊపు ని ఎవ్వరూ ఆపేలారు. ఆశికా రంగనాథ్ కి కూడా మొట్టమొదటి భారీ బ్రేక్ దొరికినట్టు అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకు ధురంధర్ ఫేమ్ శశ్వత్ సచ్ దేవ్ సంగీతం అందించబోతున్నాడు.