Homeబిజినెస్Buy House Hyderabad: హైదరాబాద్ లో ఇల్లు కొనాలని ఉందా.. తక్కువ ధరకే విల్లాలు.. ఎక్కడంటే..

Buy House Hyderabad: హైదరాబాద్ లో ఇల్లు కొనాలని ఉందా.. తక్కువ ధరకే విల్లాలు.. ఎక్కడంటే..

Buy House Hyderabad: సొంతిల్లు ఉండాలని చాలామందికి కోరిక ఉంటుంది. అయితే దీనిని నిర్మించడానికి సరైన సమయంతో పాటు అవసరమైన డబ్బు ఉండకపోవచ్చు. కానీ బ్యాంకు రుణం ఇతర మార్గాల ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. వివిధ విధుల నిమిత్తం హైదరాబాదులో ఉంటున్న వారు సొంతిల్లు కావాలని అనుకుంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. అయితే హైదరాబాద్ శివాలలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ధరలోనే విల్లాలను పొందే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు తెలుపుతున్నారు. హైదరాబాదులో ఉండేవారు సొంతిల్లు ఉండాలనుకుంటే ఈ ప్రాంతాల్లో అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. ఇంతకీ ఆ ప్రాంతాలు ఏవి? ఎంతలో సొంతిల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది..

హైదరాబాదులో గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో సొంతిల్లు కొనుక్కునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ కోట్ల రూపాయలకు పైగానే వెచ్చించిన కూడా చిన్న ఇల్లు మాత్రమే వస్తుంది. కానీ హైదరాబాద్ తూర్పు, దక్షిణ శివారు ప్రాంతాల్లో కొన్ని విల్లాలు బడ్జెట్ కు లోబడే విక్రయిస్తున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ నిపుణులు తెలుపుతున్న ప్రకారం హైదరాబాదులోని పటాన్ చెరు, అమీన్ పూర్ ప్రాంతాల్లో ధరలు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ మూడు బెడ్ రూమ్ ల తో కూడిన డూప్లెక్స్ విల్లా ధర రూ. 1.35 కోట్ల నుంచి ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఐటి కారిడార్ ఉండడంతోపాటు మెట్రో విస్తరణ కూడా జరుగుతుంది. దీంతో గేటెడ్ కమ్యూనిటీ కావాలని అనుకునేవారు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవచ్చని అంటున్నారు.

అలాగే హైదరాబాదులోని కీసర, ఈసీఐఎల్ ప్రాంతాల్లో కూడా 1.3 కోట్ల రూపాయలతో విల్లా కొనుక్కోవచ్చని అంటున్నారు. వీటితోపాటు శంషాబాద్ కు సమీపంలోని తుక్కుగూడ, మహేశ్వరం ప్రాంతాల్లో కూడా ధరలు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రాంతాల్లో 1.6 కోట్ల నుంచి రూ. రెండు కోట్ల వరకు విక్రయిస్తున్నారు. శంకర్పల్లి ప్రాంతాల్లో కూడా రూ.1.2 కోట్ల ధరతో డూప్లెక్స్ ఇళ్ల ను కొనుగోలు చేయవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ నడి బొడ్డున కంటే శివారు ప్రాంతాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండడంతో చాలామంది ఇక్కడ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందడం వల్ల ఇలాంటి ప్రదేశాల్లో కొనుగోలు చేయడం వల్ల కలిసి వస్తుందని అంటున్నారు. అయితే ఈ విల్లాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. కొందరు గ్రామపంచాయతీ పరిధిలో లేఔట్లను సిద్ధం చేశారు. ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టేముందు అన్ని వివరాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version