Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా… ప్రస్తుతం ఏ భాషలో ఉన్న హీరోని తీసుకున్న కూడా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తే చాలు అనేంతలా తను పేరు ప్రఖ్యాత లను సంపాదించుకున్నాడు. అలాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకులందరి హృదయాలను దోచుకుంటుండటం విశేషం… ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్ ‘ సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే ఫ్యామిలీ హీరోలకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా నాగార్జున డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిలో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాడు. ఇక నాగార్జున చేసిన కేడీ సినిమాకి సందీప్ రెడ్డివంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.
అయితే రీసెంట్ గా నాగార్జున కొడుకు అయినా అఖిల్ సైతం ‘లెనిన్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడంతో సందీప్ రెడ్డి వంగాను పిలిచి ఆయన అండర్ లో అఖిల్ ను హీరోగా పెట్టి ఏదైనా ఒక సినిమా చేయమని నాగార్జున అడిగారట. దానికి సందీప్ మాత్రం ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నానని తన అండర్లో ఉన్న కుర్రాళ్లలో ఎవరైనా మంచి కథ చెబితే అప్పుడు అఖిల్ సినిమా గురించి ఆలోచిద్దామని ప్రస్తుతానికి కొంచెం బిజీగా ఉన్నానని చెప్పారట.
దాంతో నాగార్జున కొంత వరకు హర్ట్ అయ్యాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగా తన వైఖరి డిఫరెంట్ గా ఉంటుంది. తను ఎవరితో అయితే సినిమా చేస్తున్నాడో ప్రస్తుతం దాని గురించి మాత్రమే ఆలోచిస్తాడు.
అనవసరమైన విషయాల గురించి తను పట్టించుకోనని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. నాగార్జున మాత్రం తన కొడుకు అయినా అఖిల్ కి వచ్చిన సక్సెస్ ని వాడుకొని మరిన్ని సక్సెస్ లు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని మొత్తానికైతే అఖిల్ ను స్టార్ హీరోగా మార్చాలనే ప్రయత్నంలో ఉన్నాడు…
