Ram charan: దిల్ రాజ్-శంకర్ సినిమాకు రాంచరణ్ కు షాకింగ్ రెమ్యూనరేషన్

Ram charan:సౌత్ లోనే గొప్ప దర్శకుడు శంకర్. ఈ తమిళ దిగ్గజం తొలిసారి తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. ఈ సినిమాకు చేతికి ఎముకేలేకుండా ఖర్చు చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఎక్కడా వెనక్కి తగ్గకుండా దిల్ రాజు నిర్మిస్తున్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే శంకర్-రాంచరణ్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా కోసం హీరో రాంచరణ్ కు […]

Written By: NARESH, Updated On : October 13, 2021 12:24 pm
Follow us on

Ram charan:సౌత్ లోనే గొప్ప దర్శకుడు శంకర్. ఈ తమిళ దిగ్గజం తొలిసారి తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. ఈ సినిమాకు చేతికి ఎముకేలేకుండా ఖర్చు చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఎక్కడా వెనక్కి తగ్గకుండా దిల్ రాజు నిర్మిస్తున్నాడని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే శంకర్-రాంచరణ్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా కోసం హీరో రాంచరణ్ కు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని.. ఈ మేరకు చరణ్ కోరినట్టే భారీగా ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారని తెలుస్తోంది.ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాంచరణ్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు.ఈ క్రమంలోనే తన రెమ్యూనరేషన్ నుకూడా ఆస్థాయిలోనే పెంచినట్టు తెలిసింది.

దిల్ రాజు నిర్మాణంలో తన బ్యానర్ నుంచి రాబోతున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా దిల్ రాజ్ నిర్మిస్తున్నాడట.. ఇందులో నటించేందుకు గాను రాంచరణ్ కు 80 కోట్లు ఇవ్వడానికి రెడీ అయినట్టు టాక్ నడుస్తోంది. దీనికి ఓకే చెప్పి మేకర్స్ రంగంలోకి దిగినట్టు తెలిసింది.

శంకర్-రాంచరణ్ మూవీ కోసం 250 కోట్ల బడ్జెట్ కేటాయించారని టాక్ నడుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా సాగే ఈ కథలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది.

80 కోట్ల రెమ్యూనరేషన్ కనుక నిజమై అయితే ప్రభాస్ తర్వాత అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రాంచరణ్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.