spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan missed Prabhu Deva movie: ప్రభుదేవా డైరెక్షన్ లో రామ్ చరణ్ చేయాల్సిన...

Ram Charan missed Prabhu Deva movie: ప్రభుదేవా డైరెక్షన్ లో రామ్ చరణ్ చేయాల్సిన సినిమా మిస్ అవ్వడానికి కారణం ఆయనేనా…

Ram Charan missed Prabhu Deva movie: ఇండియాలోనే టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్న వాళ్లలో ప్రభుదేవా మొదటి స్థానంలో ఉంటాడు… తన కొరియోగ్రఫీలో వచ్చిన చాలా సాంగ్స్ సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇప్పుడున్న యంగ్ హీరోలకు సైతం అతను కొరియోగ్రఫీ చేస్తూ తన విభిన్నమైన స్టెప్పులతో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి సంపాదించి పెట్టాడు. ఇక అలాంటి ప్రభుదేవా కాలక్రమేణ నటుడిగా మారడమే కాకుండా ఆ తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను అందుకున్నాడు. మొదట ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇక ఆ తర్వాత ప్రభాస్ ను హీరోగా పెట్టి పౌర్ణమి అనే సినిమా చేశాడు. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు. దాంతో ఇంతవరకు డీలా పడ్డాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ దర్శకుడిగా మారడం అనేది మామూలు విషయం కాదు.

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న ఘనత ప్రభుదేవా కే దక్కింది. చిరంజీవి హీరోగా వచ్చిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా ప్రభుదేవా డైరెక్షన్ లోనే తెరకెక్కింది. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో మెప్పించకపోవడంతో ప్రభుదేవా తెలుగులో స్టార్ డైరెక్టర్ గా మారలేకపోయాడు.

శంకర్ దాదా జిందాబాద్ తర్వాత ఆయన మరో ఒకటి రెండు సినిమాలను డైరెక్షన్ చేసిన కూడా అవి ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించలేదు. ఇక మగధీర తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి ఆయన తీవ్రమైన సన్నాహాలైతే చేశాడు. కానీ తను చెప్పిన కథ విషయంలో చిరంజీవి ఇంప్రెస్ కాకపోవడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక దానికి తోడుగా చిరంజీవికి ప్రభుదేవా సక్సెస్ ని ఇవ్వలేకపోయాడు.

కాబట్టి చిరంజీవి ప్రభుదేవా ను పక్కన పెట్టాడనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇక్కడ సక్సెసులు మాత్రమే మాట్లాడతాయి. హీరోలతో డైరెక్టర్స్ కి ఎంత మంచి రిలేషన్ ఉన్నా కూడా ఒక స్టార్ హీరో ఒక సినిమా ఇవ్వాలి అంటే ఆ దర్శకుడికి సక్సెస్ ఉండాలి. దాంతోపాటుగా వాళ్ళ మార్కెట్ కూడా భారీ పెరిగి ఉండాలి. తన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఒక సినిమాకి డైరెక్షన్ చేసే ఛాన్స్ దక్కుతుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular