spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan Upcoming Movies: ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లను లైన్ లో పెట్టిన రామ్...

Ram Charan Upcoming Movies: ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లను లైన్ లో పెట్టిన రామ్ చరణ్…ఇది వర్కౌట్ అయితే ఇండియా షేక్ అవుతుందా..?

Ram Charan Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ముఖ్యంగా పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఎంత వారసత్వం ఉన్న కూడా ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరోగా ఎదగడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు… ఒక క్యారెక్టర్ లో ప్రేక్షకులను మెప్పించడానికి వాళ్ళు తమ బాడీని దానికి తగ్గట్టుగా మార్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఏ చిన్న విషయంలో రాజీ పడకుండా ఆ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టి వర్క్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ లాంటి నటుడు సైతం ‘రంగస్థలం’ సినిమా నుంచి తన పంథా ను పూర్తిగా మార్చేశాడు.

Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!

ప్రేక్షకులు తన నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అది ఇవ్వడానికే తను పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు. ఇక పెద్ది సినిమా ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ అయిన తర్వాత ఆయన సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక దీంతో పాటుగా ఇద్దరు స్టార్ డైరెక్టర్లను సైతం లైన్లో పెట్టాడనే వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లను తను లైన్ లో పెట్టాడట. రీసెంట్ గా వీళ్ళిద్దరు రామ్ చరణ్ కి ఒక కథనైతే వినిపించారు. దాంతో వీళ్ళిద్దరితో ఆయన సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది.

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా దర్శకులతో సినిమాలను చేస్తున్న రామ్ చరణ్ తొందరలోనే ఇండియాను షేక్ చేసే సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇండియన్ సినిమా రికార్డులను సైతం తిరగరాయడానికి ఆయన సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది… మొత్తానికైతే ఆయన ఆయన మెగాస్టార్ చిరంజీవి ని మించి స్టార్ హీరోగా అవతరించే అవకాశం ఉందని పలువురు సినిమా మేధావులు సైతం తెలియజేస్తున్నారు…

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular